Team India: విడాకుల బాటలో మరో టీమిండియా క్రికెటర్.. 20 ఏళ్ల కాపురానికి కటీఫ్!

|

Jan 24, 2025 | 7:51 AM

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గతేడాది విడాకులు తీసుకున్నాడు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడిపోయినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే మనీశ్ పాండే వైవాహిక జీవితంలో కూడా చీలికలు వచ్చాయని తెలుస్తోంది.

Team India: విడాకుల బాటలో మరో టీమిండియా క్రికెటర్.. 20 ఏళ్ల కాపురానికి కటీఫ్!
Team India Cricketer
Follow us on

టీమిండియా క్రికెటర్ల వైవాహిక జీవితాలు సజావుగా సాగడం లేదు. మహ్మద్ షమీ, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా ఇప్పటికే తమ భార్యలతో విడాకులు తీసుకున్నారు. యుజువేంద్ర చాహల్, మనీశ్ పాండేల కాపురాల్లో కూడా కలహాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పుడు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన భార్యతో విడిపోనున్నాడని ప్రచారం సాగుతోంది. 20 ఏళ్లుగా కలిసున్న తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇప్పటికే విడివిడిగా జీవిస్తున్నారని, త్వరలోనే విడాకుల ప్రకటనపై అధికారిక ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తీ 2004లో వివాహం చేసుకున్నారు, అయితే దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీరు విడిపోతున్నట్లు కనిపిస్తోంది. వీరిద్దరూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. సెహ్వాగ్ ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లు, అప్‌డేట్‌లలో కూడా అతని భార్యతో ఉన్న ఫోటో లేదు. దీపావళి సందర్భంగా షేర్ చేసిన ఫొటోల్లో కూడా తన భార్య కనిపించలేదు. కేవలం తన పిల్లలు, తల్లితో ఉన్న ఫొటోలను మాత్రమే పోస్ట్ చేశాడు సెహ్వాగ్.

సెహ్వాగ్, ఆర్తి కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నారని, త్వరలో వారి విడాకులు ఖాయమని ప్రచారం సాగుతోంది . సెహ్వాగ్, ఆర్తికి ఆర్యవీర్, వేదాంత అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరూ తండ్రి బాటలోనే నడుస్తూ క్రికెట్ లో అదరగొడుతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే సెహ్వాగ్, ఆర్తిల బంధం గురించి ఎప్పుడూ ఎలాంటి రూమర్లు వినిపించలేదు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మన స్పర్థలు తలెత్తాయని,
ఈ కారణంగా ఇప్పుడు వారిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

1999లో టీమిండియా తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన వీరేంద్ర సెహ్వాగ్ ఏప్రిల్ 2004లో ఆర్తీ అహ్లావత్‌ను వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం కావడంతో కుటుంబాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. . అయితే ఎలాగోలా వారిద్దరూ తమ కుటుంబాలను పెళ్లికి ఒప్పించి, ఆ తర్వాత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నివాసంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన నెల రోజుల్లోనే వారి వివాహం జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..