Virat Kohli: కింగ్ కోహ్లీ గొప్ప మనసు.. తనను క్లీన్ బౌల్డ్ చేసిన బౌలర్‌కు ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా? వీడియో

రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన కోహ్లీ రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 6 పరుగులకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తనను క్లీన్ బౌల్డ్ చేసిన బౌలర్‌కు విరాట్ ఓ గొప్ప బహుమతి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Virat Kohli: కింగ్ కోహ్లీ గొప్ప మనసు.. తనను క్లీన్ బౌల్డ్ చేసిన బౌలర్‌కు ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా? వీడియో
Virat Kohli

Updated on: Feb 04, 2025 | 1:07 PM

బీసీసీఐ కచ్చితమైన ఆదేశాల మేరకు దేశవాళీ క్రికెట్‌ వైపు మొగ్గు చూపిన టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాళ్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్ల పేలవ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ దేశవాళీ టోర్నీలు ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. అందుకు తగ్గట్టుగానే చాలా ఏళ్ల తర్వాత దేశవాళీ టోర్నీ రంజీ మ్యాచ్ లో కనిపించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ తొ సహా పలువురు ఆటగాళ్లు పెద్దగ ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగ ఇటీవల ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌ ఆడిన విరాట్‌ కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ కోహ్లీ సింగిల్ డిజిట్ కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

రంజీ ట్రోఫీ ఏడో రౌండ్‌లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడడం గమనార్హం. అయితే రంజీల్లోనూ విరాట్ పేలవ ప్రదర్శన కొనసాగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఆ ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రైల్వేస్ ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ చేతిలో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లక్షలాది అభిమానుల ముందు ది గోట్ ను క్లీన్ బౌల్డ్ చేసిన సాంగ్వాన్ ఉద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇది కోహ్లీ అభిమానులకు కోపం తెచ్చింది. సోషల్ మీడియాలోనూ సాంగ్వాన ను ట్రోల్ చేశారు. కానీ ఇక్కడే కింగ్ కోహ్లీ అందరి మనసులు గెల్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హిమాన్షుకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు కోహ్లీ. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియో..

మ్యాచ్ తర్వాత, రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసిన బంతితో ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. ఈ సమయంలో, కోహ్లీ హిమాన్షును ‘నన్ను బౌల్డ చేసిన బంతి ఇదేనా’? అని అడిగాడు. హిమాన్షు అవును అని చెప్పగా, కోహ్లీ బాగా బౌలింగ్ చేశావని, నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని రైల్వేస్ బౌలర పై ప్రశంసలు కురిపించాడు. దీని తర్వాత బంతిపై ఆటోగ్రాఫ్ చేసి సంగ్వాన్ కు బహుమతిగా ఇచ్చాడు. ‘నేను మీ గురించి విన్నాను. నువ్వు మంచి బౌలర్‌ వి. నువ్వు భవిష్యత్ లో మరింత ముందుకెళ్లాలి’ అని సంగ్వాన్ కు అభినందనలు తెలిపాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కింగ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..