AB de Villiers On Virat Kohli: ఇటీవల, విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై అద్భుతమైన సెంచరీని సాధించాడు. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ ఆడ లేదు. ఇక రాజ్‌కోట్‌లో జరగనున్న మూడో వన్డేలో రీఎంట్రీ చేయనున్నాడు. అయితే, భారత జట్టు 2023 వన్డే ప్రపంచ కప్‌పై దృష్టి సారించింది. కాగా, ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ భారీ అంచనాలు వేశాడు. 2023 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డే, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలుకుతాడని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. దీంతో అభిమానులు షాక్‌కి గురయ్యారు.
2027లో దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ జరగనున్నట్టు ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు. విరాట్ కోహ్లి వచ్చే ప్రపంచకప్ వరకు ఆడడం కష్టమే. 2027 ప్రపంచకప్‌నకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు. ఇదే విషయం విరాట్ కోహ్లిని అడిగితే ప్రస్తుతం ప్రపంచకప్ 2023పైనే దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే విరాట్ కోహ్లీకి ఇంతకంటే గొప్పదనం ఏముంటుందని.. అది విరాట్ కోహ్లీకి గొప్ప కానుకగా నిలుస్తుందని ఈ సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ తెలిపాడు.
ఈ ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ బహుశా వన్డే, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ఏబీ డివిలియర్స్ అన్నాడు. అయితే, విరాట్ కోహ్లీ రాబోయే కొన్నేళ్ల పాటు టెస్టు, ఐపీఎల్ ఆడవచ్చు. అయితే, AB డివిలియర్స్ అంచనాతో కోట్లాది మంది విరాట్ కోహ్లీ అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు. అయితే 2023 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ ODI, T20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలుకుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు దాదాపు 34 ఏళ్లు. ఇది కాకుండా అతను శారీరకంగా చాలా ఫిట్‌గా ఉన్నాడు. కింగ్ కోహ్లీ వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు తప్పకుండా ఆడతాడని విరాట్ కోహ్లీ అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..