Virat Kohli: ఆ ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లు.. మనసులో మాట చెప్పేసిన విరాట్ కోహ్లీ.. వారెవరంటే..?

|

Mar 30, 2023 | 11:50 AM

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లు ఎవరు? గతంలో పలువురు ఆటగాళ్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. తాజాగా పరుగుల వీరుడు, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది.  ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌(GOAT)గా తన మనసులో మాటను కోహ్లీ బయటపెట్టారు.

Virat Kohli: ఆ ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లు.. మనసులో మాట చెప్పేసిన విరాట్ కోహ్లీ.. వారెవరంటే..?
Virat Kohli 3 11[1]
Image Credit source: Social Media
Follow us on

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లు ఎవరు? గతంలో పలువురు ఆటగాళ్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. తాజాగా పరుగుల వీరుడు, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది.  ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌(GOAT)గా తన మనసులో మాటను కోహ్లీ బయటపెట్టారు. అందులో ఒకరు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కాగా.. మరో వ్యక్తి వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్‌గా అభిప్రాయపడ్డారు. సచిన్ టెండుల్కర్ తన హీరోగా కొనియాడారు. సచిన్, వివియన్ రిచర్డ్స్ వారి తరంలో బ్యాటింగ్‌లో విప్లవం సృష్టించారని, క్రికెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని కొనియాడారు. అందకే వీరిద్దరినీ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లుగా తాను ఎప్పుడూ భావిస్తానని అన్నారు. ఆ మేరకు విరాట్ కోహ్లీ కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ఆర్సీబీ షేర్ చేసిన విరాట్ కోహ్లీ వీడియో..

విరాట్ కోహ్లీ అభిప్రాయం వాస్తవమని చాటే గణాంకాలు ఆ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల సొంతం. 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండుల్కర్ 48.52 సరాసరితో మొత్తం 34,357 పరుగులు సాధించారు. ఇందులో 100 శతకాలు, 164 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. సచిన్ తన కెరీర్‌లో 248 పరుగులు (నాటౌట్) అత్యధిక స్కోరు సాధించాడు. క్రికెట్‌ చరిత్రలో ఎన్నో రికార్డులను సచిన్ సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల సాధించిన ఆటగాడి రికార్డ్ సచిన్ పేరిటే ఉంది. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (100) సాధించిన ఆటగాడుగా సచిన్ నిలుస్తుండగా.. 75 శతకాలతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్స్డ్ కూడా తన పేరిట క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు.

మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి