Virat Kohli: టీమిండియా విక్టరీ పరేడ్ ముగిసిన వెంటనే.. రాత్రికి రాత్రే లండన్ వెళ్లిపోయిన కింగ్ కోహ్లీ.. కారణమిదే

|

Jul 05, 2024 | 7:41 PM

టీ20 ప్రపంచకప్ 2024 విక్టరీ పరేడ్ ముంబైలో అట్టహాసంగా జరిగింది. గురువారం (జులై 04) నిర్వహించిన టీమిండియా క్రికెటర్ల ఓపెన్ బస్ రోడ్ లో లక్షలాది మంది అభిమానులు భాగమయ్యారు. ఈ సందర్భంగా వాంఖడే స్టేడియం వరకు టీమ్ ఇండియా మెగా రోడ్ షో నిర్వహించింది

Virat Kohli: టీమిండియా విక్టరీ పరేడ్ ముగిసిన వెంటనే.. రాత్రికి రాత్రే లండన్ వెళ్లిపోయిన కింగ్ కోహ్లీ.. కారణమిదే
Virat Kohli
Follow us on

టీ20 ప్రపంచకప్ 2024 విక్టరీ పరేడ్ ముంబైలో అట్టహాసంగా జరిగింది. గురువారం (జులై 04) నిర్వహించిన టీమిండియా క్రికెటర్ల ఓపెన్ బస్ రోడ్ లో లక్షలాది మంది అభిమానులు భాగమయ్యారు. ఈ సందర్భంగా వాంఖడే స్టేడియం వరకు టీమ్ ఇండియా మెగా రోడ్ షో నిర్వహించింది. టీం ఇండియా ఆటగాళ్లంతా బస్సు పైకప్పుపై ఉండి అభిమానుల మద్దతు పట్ల హర్షం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లి కూడా జట్టుతో పాటు వచ్చి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో టీమ్ ఇండియా విజయోత్సవ పరేడ్ నిర్వహించింది. ఇందులో విరాట్ కోహ్లీ వందేమాతరం ఆలపించి అభిమానులను ఉర్రూతలూగించాడు. అయితే ఈ కార్యక్రమం తర్వాత విరాట్ కోహ్లీ రాత్రికి రాత్రే లండన్‌కు వెళ్లిపోయాడు. ముంబయిలో విజయోత్సవ పరేడ్ ముగిసిన అనంతరం కింగ్ కోహ్లి విమానాశ్రయంలో కనిపించి లండన్ వెళ్లిపోయాడు. వాస్తవానికి అనుష్క శర్మ, వామిక, అకాయ్ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు, కాబట్టి విరాట్ కోహ్లీ తన కుటుంబాన్ని కలవడానికి లండన్ వెళ్ళాడు. అంతకుముందు విరాట్ ఢిల్లీలో తన సోదరుడు, సోదరి కుటుంబ సభ్యులను కలిశాడు.

లండన్‌కు బయలుదేరే ముందు, విరాట్ కోహ్లీ టీమిండియా విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నాడు. అక్కడ లక్షలాది మంది అభిమానుల మధ్య వందేమాతరం నినాదాలు చేశాడు. విరాట్, రోహిత్ కలిసి ట్రోఫీని చేత పట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీని తర్వాత, ప్రపంచ ఛాంపియన్ జట్టు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకోగానే, వేలాది మంది అభిమానులు వారిద్దరినీ ఉత్సాహపరిచారు. ఆటగాళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

ఇవి కూడా చదవండి

ముంబై విమానాశ్రయంలో కింగ్ కోహ్లీ..

టీ20 ప్రపంచకప్ 2024 చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 76 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను చాంపియన్‌గా మార్చడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. అంతే కాదు ప్రపంచకప్ ఫైనల్ తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..