Virat Kohli : గంభీర్‌కు కోహ్లీ గట్టి కౌంటర్.. ద్రావిడ్‌ను పొగుడుతూ.. టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు

Virat Kohli : మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాహుల్ ద్రావిడ్ కోచింగ్ స్టైల్‌ను అభినందిస్తూ, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.2020 నుంచి 2022 వరకు ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

Virat Kohli : గంభీర్‌కు కోహ్లీ గట్టి కౌంటర్.. ద్రావిడ్‌ను పొగుడుతూ.. టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు
Virat Kohli

Updated on: May 19, 2026 | 8:54 PM

Virat Kohli : భారత క్రికెట్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‎ల మధ్య కోల్డ్ వార్ మరోసారి ముదిరినట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఒక ఆర్‌సీబీ ఈవెంట్‌లో విరాట్ కోహ్లీ తన కెరీర్‌లోని కష్టకాలం, మానసిక ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి చేసిన పరోక్ష విమర్శలేనని క్రికెట్ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ద్రావిడ్ కోచింగ్ స్టైల్‌ను ఆకాశానికెత్తిన కోహ్లీ.. గంభీర్ పేరు ఎత్తకుండానే ప్రస్తుత మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తి వెళ్లగక్కడం సంచలనంగా మారింది.

కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక, 2020 నుంచి 2022 వరకు ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చారని కోహ్లీ గుర్తుచేసుకున్నారు. “రాహుల్ భాయ్, విక్రమ్ నాపై చూపించిన శ్రద్ధ మాటల్లో చెప్పలేను. అంతర్జాతీయ స్థాయిలో అలాంటి ఒత్తిడిని ఎలా ఎదుర్కొనాలో ద్రావిడ్‌కు బాగా తెలుసు. నేను తీవ్రమైన ఇన్సెక్యూరిటీలో ఉన్నప్పుడు నన్ను ఒక బిడ్డలా చూసుకున్నారు. వారి కోసమైనా మైదానంలో కష్టపడాలి, పరుగుల వరద పారించాలి అనే కసి నాలో పెరిగింది. ద్రావిడ్ సపోర్ట్ వల్లే నేను మళ్లీ టెస్టుల్లో రాణించగలిగాను” అని కోహ్లీ మనసులోని మాటను పంచుకున్నారు.

రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగిశాక గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సీనియర్ ఆటగాళ్లకు, గంభీర్‌కు అస్సలు పడటం లేదనే వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. గంభీర్ కోచింగ్ స్టైల్ చాలా కఠినంగా, ఆటగాళ్లలో అభద్రతాభావం పెంచేలా ఉంటుందని టాక్. దీనికి బలం చేకూరుస్తూ కోహ్లీ కూడా.. టీమ్ మేనేజ్‌మెంట్‌లో డబుల్ స్టాండర్డ్స్ పెరిగిపోయాయని, ఒకరోజు అండగా ఉంటూనే మరో వారం రోజుల్లో ఆటగాళ్ల శైలిని ప్రశ్నిస్తున్నారని ఇండైరెక్ట్‌గా గంభీర్‌పై ఫైర్ అయ్యారు. గతేడాది మే 2025 లో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కూడా.. గంభీర్ ఒత్తిడి వల్లే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. రోహిత్, కోహ్లీలను తప్పించి శుభ్‌మన్ గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలని గంభీర్ పట్టుబట్టడం వల్లే కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పాడనేది ఫ్యాన్స్ వాదన.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us