RCB: “కొన్ని సార్లు విజయం సాధిస్తాం.. మరికొన్ని సార్లు విజయం సాధించలేం”.. విరాట్ కోహ్లి ఎమోషనల్ ట్వీట్

|

May 28, 2022 | 9:49 PM

ఐపీఎల్‌- 15(IPL) వ సీజన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఓటమితో ముగించింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో కోహ్లీ సేన పరాజయం మూటగట్టుకుంది. ఫలితంగా 2022లో ఆర్సీబీ ప్రయాణం...

RCB: కొన్ని సార్లు విజయం సాధిస్తాం.. మరికొన్ని సార్లు విజయం సాధించలేం.. విరాట్ కోహ్లి ఎమోషనల్ ట్వీట్
Virat Kohli
Follow us on

ఐపీఎల్‌- 15(IPL) వ సీజన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఓటమితో ముగించింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో కోహ్లీ సేన పరాజయం మూటగట్టుకుంది. ఫలితంగా 2022లో ఆర్సీబీ ప్రయాణం ముగిసింది. ఈ సారైనా టైటిల్‌ గెలుస్తుందని భావించిన ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి(Virat Kohli) ఎమోషనల్ ట్వీట్‌ చేశాడు. “కొన్నిసార్లు మనం విజయం సాధిస్తాం, మరి కొన్ని సార్లు విజయం సాధించలేము. కానీ అభిమానులు మాత్రం నిరంతరం మాకు మద్దతుగా నిలిచారు. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీలో బాగమైన మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్, అభిమానుల అందరికీ నా ధన్యవాదాలు. వచ్చే సీజన్‌లో మళ్లీ కలుద్దాం” అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ సీజన్ లో16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు.

అయితే ఆర్సీబీ గత 15 ఏళ్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. దీంతో కోహ్లీ నిరీక్షణ తప్పలేదు. ఐపీఎల్‌ ట్రోఫీని గెలవాలనే కోహ్లీ కోరిక ఇంకా సజీవంగానే ఉంది. వచ్చే ఏడాది మరోసారి బెంగళూరు కప్‌ కోసం ప్రయత్నం చేయనుంది. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు వెళ్లడం ఇది వరుసగా మూడో సంవత్సరం. ప్లేఆఫ్‌కు చేరుకోవడంలో అదృష్టం పూర్తి సహకారం అందించింది. కానీ విరాట్ కోహ్లి దురదృష్టం జట్టు విధిని శాసించినట్లు కనిపిస్తోంది. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి కేవలం రెండడుగుల దూరంలో టైటిల్‌ను చేజార్చుకుంది.