Virat Kohli: ‘ఛీటర్ – ఛీటర్’.. కోహ్లీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

IPL: అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై అభిమానులు ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 11 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీతో వాంఖడే స్టేడియంలో అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంఘటన గుర్తుకు చేసేలా చేసింది. అదేంటో ఓసారి చూద్దాం..

Virat Kohli: ఛీటర్ - ఛీటర్.. కోహ్లీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
Rcb Vs Pbks Virat Kohli Cheter Chants

Updated on: Mar 26, 2024 | 9:54 AM

Virat Kohli Old Video: ‘ విరాట్ కోహ్లీ. దశాబ్దానికి పైగా భారతీయ అభిమానుల పెదవులపై మొదటిగా వస్తున్న పేరు. విరాట్ కోహ్లి ఏదైనా మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి వచ్చినప్పుడల్లా అభిమానులు ‘కోహ్లీ-కోహ్లీ’ సందడితో స్టేడియాన్ని హోరెత్తిస్తుంటారు. టీమ్‌ఇండియా తరుపున అద్బుతమైన ఆటతీరుతో కోహ్లీ ఈ ప్రేమను పొందుతున్నాడు. కానీ మీరు ఊహించగలరా, ఇండియన్ స్టేడియంలో భారత అభిమానులు ‘కోహ్లీ-కోహ్లీ’ అని కాకుండా కాదు ‘చీటర్-చీటర్’ అని అరవడంతో కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసేశారు.

IPL 2024లో ఆదివారం, మార్చి 24, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా, హార్దిక్ పాండ్యాపై అభిమానుల ఆగ్రహం కనిపించింది. స్టార్ ఆల్ రౌండర్ గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఒకసారి జట్టు టైటిల్‌ను గెలుచుకున్నాడు. అయితే గత ఏడాది వేలానికి ముందు, అతను అకస్మాత్తుగా గుజరాత్‌ను విడిచిపెట్టి, తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. దీంతో గుజరాత్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ముంబై రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌ని కెప్టెన్‌గా చేయడంతో ముంబై అభిమానులు కూడా దీంతో రెచ్చిపోయారు. హార్దిక్‌పై ఈ ఆగ్రహ ప్రభావం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో విపరీతంగా కనిపించింది. అక్కడ ప్రేక్షకులు అతనిపై అసభ్య పదజాలం ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి

విరాట్‌కు వ్యతిరేకంగా నినాదాలు..

స్వదేశీ ఆటగాడి కోసం ఇలా అరిచడం 11 సంవత్సరాల క్రితం విరాట్ కోహ్లీ కూడా అలాంటిదే ఎదుర్కోవాల్సిన సంఘటనను గుర్తు చేసింది. ఐపీఎల్ 2013 సీజన్‌లో విరాట్ కోహ్లి తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు విరాట్‌పై బిగ్గరగా అరిచి, ‘చీటర్-చీటర్’ అంటూ నినాదాలు చేశారు.

8 సంవత్సరాల క్రితం, విరాట్ కోహ్లీని ముంబైలోని అభిమానులు ఛీటర్ అంటూ పిలిచారు. ఇలాంటి ఘటనలు ఆటగాళ్ల మధ్య విద్వేషాన్ని సృష్టిస్తాయి.

కోహ్లీ గుండె ముక్కలైన వేళ..

ప్రేక్షకుల ఈ చర్య కోహ్లీ హృదయాన్ని బద్దలు చేసింది. మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీని ఈ ప్రవర్తనపై ప్రశ్నించగా, కోహ్లీ దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ తర్వాత ప్రపంచం అంతం కాదని, అతను టీమ్ ఇండియాకు ఆడుతున్నప్పుడు, ఇదే ప్రజలు అతనిని ఉత్సాహపరుస్తారు. కానీ ఇలా చేయకూడదు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల మధ్య ద్వేషాన్ని పెంచుతాయని కోహ్లి అప్పుడు చెప్పుకొచ్చాడు. అదే వాంఖడే స్టేడియంలో 2023 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లో 50వ సెంచరీని సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లి, స్టేడియం మొత్తం ‘కోహ్లీ-కోహ్లీ’ అంటూ కేకలు వేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..