Virat Kohli: వామికను ఇప్పటి వరకు ప్రపంచానికి చూపించని విరుష్క జంట.. తాజాగా పోస్ట్‌ చేసిన ఫోటోలనూ..

Virat Kohli: కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే క్రికెటర్లలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మొదటి వరుసలో ఉంటాడు. కాస్త ఖాళీ సమయం దొరికినా భార్యతో కలిసి ఎంజాయ్‌ చేస్తుంటాడు...

Virat Kohli: వామికను ఇప్పటి వరకు ప్రపంచానికి చూపించని విరుష్క జంట.. తాజాగా పోస్ట్‌ చేసిన ఫోటోలనూ..
Virat Anushka

Updated on: Oct 21, 2021 | 9:48 AM

Virat Kohli: కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే క్రికెటర్లలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మొదటి వరుసలో ఉంటాడు. కాస్త ఖాళీ సమయం దొరికినా భార్యతో కలిసి ఎంజాయ్‌ చేస్తుంటాడు. టోర్నీల్లో భాగంగా విదేశాలకు వెళ్లే సమయంలోనూ భార్య అనుష్కను తోడుగా తీసుకెళ్లడం విరాట్‌కు అలవాటే. అయితే ఇప్పుడు ఈ జాబితాలో విరుష్క జంట గారాల పట్టి వామిక కూడా వచ్చి చేరింది. ఈ క్రమంలోనే ఈ జంట ఎక్కడికి వెళ్లినా వామికను కూడా వెంట తీసుకెళుతున్నారు. ఇందులో భాగంగా చిన్నారితో దిగిన ఫోటోలను విరాట్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు పోస్ట్‌ చేసిన ఫోటోల్లో వామిక మొహం మాత్రం కనిపించకుండా ఈ జంట జాగ్రత్త పడుతోంది. తన చిన్నారిని అప్పుడే ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంటోన్న ఈ జంట అందుకునే వామిక కనిపించకుండ ఉన్న ఫోటోలనే పోస్ట్‌ చేసింది.

ఇదిలా ఉంటే విరాట్‌ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌లో ఉన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నుంచి ఇప్పటి వరకు విరాట్‌ అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలోనే దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా దుబాయ్‌లో భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి ఓ రెస్టారెంట్‌లో సందడి చేశాడు. ఈ క్రమంలోనే హోటల్‌లో దిగిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు విరాట్‌.

అయితే ఇందులోనూ వామిక మొహం చూపించకపోవడం గమనార్హం. విరాట్‌ ఈ ఫోటో పోస్ట్‌ చేసిన ఒక్క రోజు కూడా గడవకముందే ఏకంగా 66 లక్షల మంది లైక్‌ చేశారు. ఇక ఈ ఫోటోను చూసిన విరాట్‌ అభిమానులు వామికను ఇంకెప్పుడు చూపిస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి విరుష్క జంట తమ ముద్దుల పాపాయిని ప్రపంచానికి పరిచయం చేస్తారో చూడాలి.

Also Read: Bhishma Niti: పాలకులను ప్రజలే గౌరవించనప్పుడు శత్రువులు అతడిని అలక్ష్యం చేస్తారంటూ ప్రజాధర్మం గురించి చెప్పిన భీష్ముడు

యాపిల్స్‌ అధికంగా తింటున్నారా.. అయితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే.. వీడియో

Curd Vs Buttermilk: పెరుగు బెస్టా.. మజ్జిగ బెటరా.! ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..