Virat Kohli: కేరళ రెస్టారెంట్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ..!
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి.
Virat Kohli: ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఇక రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో గెలిచి, 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే లార్డ్స్ టెస్టులో విజయం సాధించిన తరువాత టీమిండియా జట్టు ఇంగ్లండ్‌లోని కేరళ రెస్టారెంట్ థరావాడ్‌లో ఓన సద్యను ఆస్వాదించేందుకు వెళ్లారు. ఓనం ఫెస్టివల్‌లో భాగంగా అక్కడి రెస్టారెంట్‌లో ఓనం సద్యలో భాగంగా తయారుచేసిన వంటకాలను రుచి చేశారు. నేటి నుంచి ప్రారంభమైన మూడో టెస్టు కోసం టీమిండియా జట్టు హెడ్కింగ్కు చేరుకుంది. లీడ్స్‌లో ఉన్న థరావాడ్ రెస్టారెంట్‌ను సందర్శించి అక్కడి స్పెషల్ వంటకాలను రుచి చూశారు.
కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతోపాటు జట్టులోని మిగతా ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఈ రెస్టారెంట్‌ను సందర్శంచిన వారిలో ఉన్నారు. ఈ స్పెషల్ వంటకాలను రుచి చూసేందుకు సహాయక సిబ్బందితో సహా దాదాపు 65 మంది టీమిండియా మెంబర్స్ వచ్చారని రెస్టారెంట్ యజమాని సీబీ జోస్ తెలిపారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బౌలర్ దెబ్బకు టీమిండియా బ్యాట్స్‌మెన్స్ పేకమేడలా కుప్పకూలారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకు ఆలౌట్ అయ్యారు. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన భారత్.. రెండో సెషన్‌లో మిగతా 27 పరుగులు చేసి చాపచుట్టేసింది. కేఎల్ రాహుల్(0), చతేశ్వర్(1), విరాట్ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా తరపున రోహిత్ శర్మ(19) టాప్ స్కోరర్‌గా నిలవగా రహానె 18 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను చావుదెబ్బ తీశారు.
Also Read: IND Vs ENG: విజృంభించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. కుప్పకూలిన కోహ్లీసేన.. 78 పరుగులకే ఆలౌట్..