RCB vs RR: చిన్నస్వామి స్టేడియంలో 1450 రోజుల తర్వాత కెప్టెన్‌గా ఎంట్రీ.. కట్‌చేస్తే.. తొలి బంతికే గోల్డెన్ డక్..

Virat Kohli Golden Duck: ఎం. చిన్నస్వామి స్టేడియంలో 1450 రోజుల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటమనిని ఎదుర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లీ మ్యాచ్‌లోని తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.

RCB vs RR: చిన్నస్వామి స్టేడియంలో 1450 రోజుల తర్వాత కెప్టెన్‌గా ఎంట్రీ.. కట్‌చేస్తే.. తొలి బంతికే గోల్డెన్ డక్..
Trent Boult Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Apr 23, 2023 | 4:39 PM

RCB vs RR, Trent Boult: ఎం. చిన్నస్వామి స్టేడియంలో 1450 రోజుల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటమనిని ఎదుర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లీ మ్యాచ్‌లోని తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కోహ్లీని ఖాతా తెరవకుండానే టీ20 క్రికెట్‌లో ఔట్ చేయడంలో తొలిసారి సక్సెస్ అయిన రాజస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. తన ఖాతాలో అద్బుతమైన రికార్డ్ వేసుకున్నాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో మంచి రిథమ్‌తో కనిపిస్తున్న విరాట్ కోహ్లి.. ఇప్పటివరకు దాదాపు ప్రతి ఇన్నింగ్స్‌లో బలమైన ఆరంభాన్నిచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి నుంచి మరో మ్యాచ్‌లో శుభారంభం ఆశించారు. అయితే, ట్రెంట్ బౌల్ట్ ఎలాంటి తప్పు చేయలేదు. బోల్ట్‌పై కోహ్లీ అత్యుత్తమ రికార్డును కలిగి ఉన్నాడు. ప్రతీసారి చావుదెబ్బలు తింటోన్న బౌల్డ్.. ఈసారి మాత్రం కోహ్లీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో కోహ్లీ అద్భుత రికార్డును చెడగొట్టి పైచేయి సాధించాడు.

ఇవి కూడా చదవండి

మొదటిసారి కోహ్లీని ఔట్ చేసిన బౌల్ట్..

టాస్ ఓడిన బెంగళూరు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఎప్పటిలాగే కోహ్లి స్ట్రైక్‌లో ఉన్నాడు. లెఫ్టార్మ్ పేసర్ బోల్ట్ మరో ఎండ్ నుంచి బౌలింగ్ ప్రారంభించాడు. తొలి బంతికే బోల్ట్ చిన్నస్వామి సందడిని పూర్తిగా నిశ్శబ్ధంగా మార్చేశాడు. బౌల్ట్ నుంచి అద్భుతమైన ఇన్‌స్వింగ్ లైన్ ఆఫ్ స్టంప్‌పై పడింది. కోహ్లీ దానిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి లోపలికి వచ్చి నేరుగా అతని ప్యాడ్‌లను తాకింది.

అంపైర్‌కి ఔట్‌ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో కోహ్లీ కూడా డీఆర్‌ఎస్ తీసుకోకపోవడమే మంచిదని భావించాడు. ఈ విధంగా తన టీ20 కెరీర్‌లో తొలిసారిగా కోహ్లీని బలిపశువుగా చేసుకున్నాడు బోల్ట్.

సెంచరీ కొట్టిన బోల్ట్..

కోహ్లీని తొలిసారి ఔట్ చేసిన బౌల్డ్.. తన కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా మలుచుకున్నాడు. ఎందుకంటే దీనితో అతను ఐపీఎల్‌లో తన 100 వికెట్లను కూడా పూర్తి చేశాడు. అలాగే ఐపీఎల్‌లో తొలి ఓవర్‌లోనే 21 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ (22) పేరిట ఎక్కువ వికెట్లు ఉన్నాయి. కాగా, బోల్ట్ ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాతి ఓవర్‌లోనే షాబాజ్ అహ్మద్ వికెట్ కూడా పడగొట్టి బెంగళూరు కష్టాలను పెంచాడు.

7వ సారి ఇలా..

కోహ్లీ గురించి మాట్లాడితే.. ఈ సీజన్ స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లీ.. అత్యధిక పరుగులు చేసినవారిలో ఒకడిగా నిలిచాడు. కాగా, ఐపీఎల్‌లో 7వ సారి ‘గోల్డెన్ డక్’ (తొలి బంతికే ఖాతా తెరవకుండానే ఔట్)గా వెనుదిరిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా
ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా
CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ
CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ
దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌
దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.