Viral Video: రజినీకాంత్ స్టైల్‎లో వెంకటేశ్ అయ్యర్ సెలబ్రెషన్స్.. వైరల్‎గా మారిన వీడియో..

|

Dec 13, 2021 | 12:41 PM

ఐపీఎల్-2021 రెండో దశలో వెలుగులోకి వచ్చిన కోల్‎కత్తా నైట్‎రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ తన ఫామ్‎ను కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో చండీగఢ్‎పై సెంచరీ చేశాడు...

Viral Video: రజినీకాంత్ స్టైల్‎లో వెంకటేశ్ అయ్యర్ సెలబ్రెషన్స్.. వైరల్‎గా మారిన వీడియో..
Iyyar
Follow us on

ఐపీఎల్-2021 రెండో దశలో వెలుగులోకి వచ్చిన కోల్‎కత్తా నైట్‎రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ తన ఫామ్‎ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‎లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన 26 ఏళ్ల అతను, ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఆదివారం చండీగఢ్‎పై సెంచరీ చేశాడు. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ 113 బంతుల్లో 151 పరుగులు చేశాడు. దీంతో మధ్యప్రదేశ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 331పరుగులు చేసింది. 133.63 స్ట్రైక్ రేట్‎తో బ్యాటింగ్ చేసిన అయ్యర్ ఎనిమిది ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగిపోయాడు. అతడిని సందీప్ శర్మ అవుట్ చేశాడు. ఈ సెంచరీని ఆదివారం 71వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు అంకితం చేసిన ఈ యుత్ ఐకాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు.

సెచంరీ తర్వాత అతను చేసిన సూపర్ స్టార్ స్టైల్‎లో వెంకటేశ్ అయ్యర్ సెలబ్రషన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. రజినీకాంత్ స్టైల్‎ను అనుకరించేందుకు అయ్యర్ ప్రయత్నిస్తున్న వీడియోను BCCI, కోల్‌కతా నైట్ రైడర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయ్యర్‌తో పాటు, మధ్యప్రదేశ్ కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవ 80 బంతుల్లో 70 పరుగులు చేశాడు. 26 ఏళ్ల అతను దేశీయ 50 ఓవర్ల టోర్నమెంట్‌లో ఇప్పటివరకు రెండు సెంచరీలు సాధించాడు. అతను కేరళపై 84 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‎లో 49 బంతుల్లో 71 పరుగులు చేశాడు.

Read Also.. Virat Kohli: టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీని వ్యక్తిగతంగా అభ్యర్థించా.. కానీ అతను వైదొలిగాడు..!