టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత్ దైపాక్షిక సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌ను ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత్ గెలుచుకుంది. ఈ సందర్భంగా హార్దిక్‌తో కలిసి భారత మాజీ సారథి ధోని, ర్యాపర్ బాద్షా సరదాగా సమయాన్ని గడిపారు. ఆ క్రమంలోనే వారంతా కలిసి చిందులు కూడా వేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో ఎక్కడ, ఎప్పుడు జరిగినదో తెలిసిరానప్పటికీ.. చాలా మంది దుబాయ్‌లో వీరంతా కలిశారని భావిస్తున్నారు.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ గైర్హాజరు కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలను స్వీకరించాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా రోహిత్ స్థానంలో శిఖర్ ధావన్ జట్టును నడిపిస్తున్నాడు. తన సారథ్యంలో భారత్ టీ20 సిరీస్‌ను గెలుచుకున్న సందర్భంగా.. ఆ సంతోషాన్ని భారత దిగ్గజ కెప్టెన్‌లలో ఒకరైన ధోనితో పంచుకోవాలిన హార్దిక్ భావిస్తున్నాట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడ వీడియో ఉంది..
Ms Dhoni, Hardik Pandya and Badshah partying in Dubai ??pic.twitter.com/Ww2pLoa9cF
— Cricket? Lover (@CricCrazyV) November 27, 2022
అయితే, ఇటీవలే ఆర్థర్ యాష్ స్టేడియంలో యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో టెన్నిస్ మ్యాచ్‌ని వీక్షిస్తూ ధోని కనువిందు చేశాడు. రు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అయిన కేదార్ జాదవ్‌తో కలిసి అతను గోల్ఫ్ మ్యాచ్‌లను చూడడంలో మునిగిపోయాడు.
కాగా, న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్‌ను ఆడుతోంది. న్యూజిలాండ్‌తో భారత్ ఆడిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక మూడో వన్డే నవంబర్ 30న జరగనుంది. ఈ సిరిస్‌కు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ, KL రాహుల్ , మహ్మద్ షమీ తదితర సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..