Rajasthan Royals : కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న రాజస్థాన్ సెన్సేషన్
Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన కార్టూన్ అలవాటు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ రికార్డులు సృష్టిస్తున్న ఈ కుర్రాడి వీడియో వైరల్ అవుతుంది.. మ్యాచ్ సమయంలో తన మైండ్లో ఏం నడవదని ఆన్సర్ ఇచ్చాడు.

Rajasthan Royals : ఐపీఎల్ 2026లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. అదే వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత భారీ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చి రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ బుడతడు, తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మీద మ్యాచ్ ముగిసిన తర్వాత తను చెప్పిన పిల్ల చేష్టల గురించి మీరు కూడా నవ్వుకుంటారు. వైభవ్ వయసు మీద చాలా చర్చ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేసినప్పుడు వయసు కేవలం 13 ఏళ్లు. ఇప్పుడు 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. వయసు చిన్నదైనా బ్యాట్ పడితే మాత్రం పరుగుల వరద పారాల్సిందే. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా శతకం చేసిన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఇంత చిన్న వయసులో ఇంత పరిణతితో ఆడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
బుధవారం లక్నోతో జరిగిన మ్యాచ్ తర్వాత హాట్‌స్టార్ ప్రజెంటర్ వైభవ్‌తో ముచ్చటించారు. “మేము కార్టూన్లు చూసే వయసులో నువ్వు బౌలర్లను కార్టూన్లుగా మార్చేసి ఆడుకుంటున్నావ్.. అసలు నీ మైండ్‌లో ఏం నడుస్తోంది?” అని అడిగారు. దానికి వైభవ్ నవ్వుతూ.. “నా మైండ్‌లో ఏమీ ఉండదు సార్. నిజానికి నేను కూడా ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తాను. ఆ అలవాటు ఇంకా పోలేదు. కానీ గ్రౌండ్‌లోకి వెళ్లాక మాత్రం నా ఫోకస్ అంతా గేమ్ మీదే ఉంటుంది” అని సమాధానం ఇచ్చాడు.
Watches cartoons, smashes sixes for fun! 😁
Not many 15-year-olds can do both. That’s Vaibhav Sooryavanshi for you! 🩷#TATAIPL #LSGvRR #LSGvsRR pic.twitter.com/sGBiMv0T8T
— Star Sports (@StarSportsIndia) April 22, 2026
లక్నోతో మ్యాచ్‌లో ఏమైంది?
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన అద్భుతమైన బౌలింగ్‌లో వైభవ్ వరుసగా 5 బంతులు డాట్ ఆడాడు. ఆ ఒత్తిడిలో చివరి బంతికి భారీ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. కానీ రాజస్థాన్ బౌలర్లు మాత్రం దుమ్మురేపి లక్నోను 119 పరుగులకే కట్టడి చేశారు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లతో చెలరేగగా, రవీంద్ర జడేజా తన ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. 43 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ కూడా తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. వైభవ్ త్వరగా అవుట్ అయినా, జట్టు గెలవడంతో రాజస్థాన్ ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. వైభవ్ కూడా తర్వాతి మ్యాచ్‌లో 2 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుతామని ధీమా వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
