9 సిక్సర్లు, 133 పరుగులతో సూర్యవంశీ బీభత్సం.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియాను క్లీన్‌ స్వీప్ చేసిన భారత్

Vaibhav Suryavanshi, INDIA U19 Team Beat AUSTRALIA U19 Team: భారత అండర్-19 జట్టు రెండవ మల్టీ-డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టును ఓడించి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్ విజయంలో వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు.

9 సిక్సర్లు, 133 పరుగులతో సూర్యవంశీ బీభత్సం.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియాను క్లీన్‌ స్వీప్ చేసిన భారత్
Vaibhav Suryavanshi

Updated on: Oct 08, 2025 | 12:18 PM

IND U19 beat AUS U19 : భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల అండర్-19 టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. రెండో మల్టీ-డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌కు 81 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. మొత్తంxe భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించింది. 14 ఏళ్ల స్టార్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా ఈ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 133 పరుగులు చేశాడు.

9 సిక్సర్లతో 133 పరుగులు..

ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన రెండు మ్యాచ్‌ల మల్టీ-డే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ 9 సిక్సర్లు, 11 ఫోర్లతో సహా 133 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌లలో అతను ఈ పరుగులు చేశాడు. మొదటి మల్టీ-డే మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో, వైభవ్ సూర్యవంశీ 86 బంతులు ఎదుర్కొని 8 సిక్సర్లు, 9 ఫోర్లతో సహా 113 పరుగులు చేశాడు. రెడ్-బాల్ క్రికెట్‌లో ఇది అతని అత్యధిక స్కోరు.

రెండవ మల్టీ-డే మ్యాచ్‌లో, వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్‌లలో ఒక సిక్స్, రెండు ఫోర్లతో సహా కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఈ విధంగా, ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన మొత్తం సిరీస్‌లో, అతను తొమ్మిది సిక్స్‌లతో 133 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియాపై భారత్ క్లీన్ స్వీప్..

ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి మల్టీ-డే మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండవ మల్టీ-డే మ్యాచ్‌లో, భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఆయుష్ మాత్రే నాయకత్వంలో రెడ్-బాల్ క్రికెట్‌లో భారత జట్టు సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. గతంలో, ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్ డ్రాగా ముగిసింది.

సిరీస్‌లోని చివరి మ్యాచ్ స్థితి..

రెండవ మల్టీ-డే మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మొదట బ్యాటింగ్ చేసి 135 పరుగులు చేసింది. ప్రతిస్పందనగా, భారత అండర్-19 జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేసి 36 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు ముందు 81 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ సులభంగా ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధిచింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..