Usain Bolt: క్రికెట్‌లోకి జమైకా పరుగుల వీరుడు.. ఆ లీగ్‌ తోనే ఉసేన్ బోల్ట్ ఎంట్రీ..!

|

Dec 10, 2021 | 9:39 AM

Usain Bolt: పరుగుల రారాజు ఉసేన్ బోల్ట్ గురించి తెలియని వారుండరు. అత్యంత తక్కువ వ్యవధిలోనే వంద మీటర్ల పరుగు పందాన్ని కంప్లీట్ చేసి.. ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేశాడు.

Usain Bolt: క్రికెట్‌లోకి జమైకా పరుగుల వీరుడు.. ఆ లీగ్‌ తోనే ఉసేన్ బోల్ట్ ఎంట్రీ..!
Usain Bolt
Follow us on

Usain Bolt: పరుగుల రారాజు ఉసేన్ బోల్ట్ గురించి తెలియని వారుండరు. అత్యంత తక్కువ వ్యవధిలోనే వంద మీటర్ల పరుగు పందాన్ని కంప్లీట్ చేసి.. ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేశాడు. రన్నింగ్‌లో వరల్డ్ ఛాంపియన్‌గా గుర్తింపు పొందిన జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఇప్పుడు తన కలను సాకారం చేసుకోబోతున్నాడు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు రంగం చేసుకున్నాడు. ఈ మేరకు వార్తలు గుప్పుమంటున్నాయి. మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో త్వరలో నిర్వహించబోతున్న ఓ టీ20 లీగ్ లో ఉసేన్ బోల్ట్ పాల్గొననున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఇప్పటికే ఓ భారత డిజిటల్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ ఈ లీగ్‌ కోసం బోల్ట్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

కాగా జమైకా చిరుతగా పేరొందిన ఉసేన్ బోల్ట్‌ ఎనిమిది సార్లు ఒలిపింక్స్‌లో బంగారు పతక విజేతగా నిలిచాడు. అదే విధంగా 2009 బెర్లిన్‌లో జరిగిన ఐఏఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లను 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఇదే ప్రస్తుతం ప్రపంచ రికార్డును కలిగి ఉంది. కాగా ఇటీవలే రన్నింగ్‌ నుంచి బోల్ట్‌ రిటైర్‌మ్మెంట్‌ ప్రకటించాడు. ఈ క్రమంలో తన చిన్ననాటి కల అయిన క్రికెట్‌లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. తన రన్నింగ్‌తో సంచలనం సృష్టించిన బోల్డ్.. బ్యాట్ పట్టి రాణిస్తాడా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Also read:

Bipin Rawat Helicopter Crash: మంటల్లో జవాన్లు, నీళ్లు అడిగిన రావత్.. హెలికాప్టర్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు చెప్పిన షాకింగ్ విషయాలు..!

Viral Video: రెండు తలలు, మూడు కళ్ళు ఉన్న బల్లి.. నెట్టింట వీడియో వైరల్‌

RRR: ఫ్యాన్స్‌ దెబ్బకు తల పట్టుకుని వెనక్కి తగ్గిన జక్కన్న !! వీడియో