IND vs WI: భారత జట్టు వెస్టిండీస్ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో ఆడిన టెస్ట్ సిరీస్ , వన్డే సిరీస్‌లను భారత్ సొంతం చేసుకుంది. అయితే టీ20 సిరీస్‌లో మాత్రం హర్దిక్ సేన చేతులెత్తేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయే దశలో ఉన్న భారత జట్టును తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లు ఆదుకున్నారు. కానీ ఆదివారం జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ మినహా మిగిలినవారంతా చేతులెత్తేశారు. దీంతో భారత జట్టు 6 సంవత్సరాల తర్వాత తొలి సారిగా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. అలాగే దాదాపు 17 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ జట్టు భారత్‌పై సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. అయితే వారి ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లుగా ఉన్నాయి మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ హార్దిక్ మాటలు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుపై వెస్టిండీస్ టీమ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ తర్వాత హార్దిక్ మాట్లాడుతూ ‘ఒక టీమ్‌గా మమ్మల్ని మేము ఛాలెంజ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నా. ఇవన్నీ కూడా కొత్త విషయాలు నేర్చుకునే మ్యాచులే. అడపాదడపా ఒక సిరీస్ కోల్పోవడం సమస్యే కాదు. కానీ టార్గెట్ కోసం కమిట్మెంట్ చాలా ముఖ్యం. ఒక్కోసారి ఓడిపోవడం కూడా మంచిదే’నని అన్నాడు. ఇలా సిరీస్ కోల్పోవడం సమస్యే కాదని హార్దిక్ అనడం అభిమానులకు నచ్చలేదు. ఇదే పాటు మ్యాచ్ సమయంలో పాండ్యా చేసిన బౌలింగ్ మార్పులు కూడా ఓటమికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అటు టీమిండియా అభిమానులు, ఇటు నెటిజన్లు హార్దిక్‌ని ట్రోల్ చేస్తున్నారు.
#TeamIndia put in a fight but it was West Indies who won the fifth & final T20I to win the series 3-2.#WIvIND pic.twitter.com/19KVS0MBHJ
— BCCI (@BCCI) August 13, 2023
హార్దిక్‌ని తొలగించండి..
@BCCI
Please Sack #HardikPandya & the supporting staffs ASAP. Bunch of Loosers.BTW, sometimes Loosing a series from a weaker team doesn’t matter much but Attitude Does !! 🙏
— ༒ Deep ༒ (@D_TechnoFreak) August 14, 2023
‘మనం చేయాల్సిందే’
#HardikPandya
Rohit and Virat be like pic.twitter.com/kpm28UyhRM— Hum Kaun (@HumKaun148828) August 14, 2023
హార్దిక్, రాహుల్‌ని తప్పించి.. విరాట్‌ని తీసుకురాండి..
1) hardik ku captaincy se htao
2)virat se t20 mae open krwao
3)sanju ku bye bye kru
4)rahul dravid ku hato
5)Ashwin ku asia cup and world cup mae lao he can bat#HardikPandya #IndianCricketTeam #ViratKohli𓃵 #— Abhinav (@Anmol93050386) August 14, 2023
కెప్టెన్ క్లోన్..
Captain cool. Captain Clown. pic.twitter.com/Yj8cVi7GUO
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) August 6, 2023
నెహ్రా ఉండాల్సిందే..
#HardikPandya needs nehra ji, who can feed him what to do. Coz he is very clueless captain.#INDvsWI
— Indian Sports (@Indian_Sportz) August 14, 2023
ఇదిలా ఉండగా.. జట్టులోని యువ ఆటగాళ్లను సరిగ్గా ఉపయోగించుకోవడం కెప్టెన్‌కి మాత్రమే కాదు, జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి కూడా అర్థం కావడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే పలువురు అభిమానులు ద్రావిడ్‌ని కూడా కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.