WTC 20205: ఉత్కంఠగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు.. టాప్-2 నుంచి ఆస్ట్రేలియా ఔట్.. టీమిండియా ప్లేస్ కూడా!

|

Nov 30, 2024 | 7:01 PM

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ రేసులో ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ జట్టు టాప్-2 నుంచి కూడా నిష్క్రమించింది. అదే సమయంలో ఒక జట్టు 5వ స్థానం నుంచి నేరుగా రెండవ స్థానానికి చేరుకుంది.

WTC 20205: ఉత్కంఠగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు.. టాప్-2 నుంచి ఆస్ట్రేలియా ఔట్.. టీమిండియా ప్లేస్ కూడా!
Team India
Follow us on

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​ఫైనల్ రేసు చాలా ఉత్కంఠగా మారింది. భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌లు ఫైనల్‌ రేసులో ప్రధాన పోటీదారులుగా నిలిచాయి. తాజాగా పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి పాయింట్ల పట్టికలో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ జట్టు టాప్-2 ప్లేస్ నుంచి కిందకు పడిపోయింది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2023-25 ​​ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీలంక జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్ కింగ్స్‌మీడ్ డెర్బీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేసింది. దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 ఓటములతో రెండో స్థానంలో నిలిచింది. ఆజట్టు విజయాల శాతం పాయింట్లు ఇప్పుడు 59.25గా మారింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ రేసులో వెనుకబడింది.

మరోవైపు శ్రీలంక జట్టు 3వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయింది. 10 టెస్టు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ఇది 5వ ఓటమి. లంక జట్టు విజయాల శాతం 50.00గా ఉంది. ఇది అంతకుముందు 55.56. దీంతో పాటు 15 మ్యాచుల్లో 9 విజయాలతో 61.11 శాతం పాయింట్లతో టీమ్ ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఆస్ట్రేలియా జట్టు 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 57.69 శాతం పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. అంటే ఇప్పుడు దక్షిణాఫ్రికాకు టీమిండియాను అధిగమించే అవకాశం దక్కబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అడిలైడ్ టెస్టులో టీమిండియా ఎలాగైనా గెలవాల్సిందే.

ఇవి కూడా చదవండి

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక ఇదే..

 

మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. దీనికి సమాధానంగా శ్రీలంక జట్టు ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లు మాత్రమే ఆడి 42 పరుగులకే కుప్పకూలింది. దీని తర్వాత, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా శ్రీలంకకు మ్యాచ్‌లో 516 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. అయితే దానికి సమాధానంగా శ్రీలంక జట్టు 282 పరుగులకే ఆలౌట్ అయి 233 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..