టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. బ్రిస్బేన్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ చేస్తోంది. అయితే, 14 వ ఓవర్లో ఓ అద్భుతం జరిగింది. అప్పటికే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీం 113 పరుగులు చేసింది. క్రీజులో మార్కస్ స్టోయినీస్, ఆరోన్ ఫించ్ క్రీజులో ఉన్నారు. అయితే, మార్క్ ఐదర్ బౌలింగ్ చేస్తున్నాడు. భారీ బౌండరీ కోసం స్టోయినీస్ బంతిని బలంగా కొట్టేశాడు. ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డిండ్ చేస్తున్న మెక్‌కార్తీ తన అద్భుత ఫీల్డింగ్‌తో అందర్నీ మెప్పించాడు. ఏకంగా ప్రాణాలకు తెగించి, బౌండరీని ఆపేశాడు. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు.. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా జోహార్లు చేశారు. అయితే, ఈ క్రమంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ వీడియో మీరు కూడా చూడండి..
బౌండరీని ఆపేందుకు పరిగెత్తుకుంటూ వచ్చిన మెక్ కార్తీ.. అమాతం గాల్లోకి జంప్ చేసి బాల్‌ను క్యాచ్ అందుకున్నాడు. అయితే, బౌండరీ అవతల పడేలా ఉండడంతో, బంతనికి వెనకకు విసిరేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బలంగా కిందపపడంతో కొద్దిగా దెబ్బతగిలినట్లైంది. ఆ తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, మరలా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మెక్ కార్తీ అటు ఫీల్డింగ్‌తోనే కాదు.. ఇటు బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
మెక్‌కార్తీ తన అత్యుత్తమ ఫీల్డింగ్‌లో గాయపడ్డాడు. వీపుపై అమాంతం పడిపోయాడు. తరువాత చాలా నొప్పితో బాధపడ్డాడు. ఆ తరువాత, ఐరిష్ ఫిజియో వెంటనే అతనిని చేరుకున్నాడు. ఈ సమయంలో ఈ ఆటగాడు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడ్డాడు.
20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఐర్లాండ్ ఆటగాడు బారీ మెక్‌కార్తీ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికె), పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ (సి), లోర్కాన్ టక్కర్ (వారం), హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంపర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, ఫిన్ హ్యాండ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్.