Viral: ఎక్కడి నుంచి వచ్చార్రా బాబు.. అంపైర్ల బ్లండర్ మిస్టేక్‌పై పేలుతోన్న జోక్స్.. ఏం చేశారంటే..

|

Jan 07, 2023 | 2:30 PM

సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మెన్ జోర్డాన్ సిల్క్ పేలవమైన అంపైరింగ్ కారణంగా పెవిలియన్‌ చేరాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Viral: ఎక్కడి నుంచి వచ్చార్రా బాబు.. అంపైర్ల బ్లండర్ మిస్టేక్‌పై పేలుతోన్న జోక్స్.. ఏం చేశారంటే..
Bbl Viral Photo
Follow us on

బిగ్ బాష్ లీగ్‌లో వివాదాల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే రెండు వివాదాలు నెట్టింట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవి సద్దుమణగక ముందే మరో వివాదం నెలకొంది. సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ జట్లు తలపడిన మ్యాచ్ లో ఈ వివాదం బయటకు వచ్చింది. సిడ్నీ సిక్సర్స్‌కు మ్యాచ్ గెలవడానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరం. కానీ, ఆ తర్వాత పెద్ద డ్రామా జరిగింది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మెన్ జోర్డాన్ సిల్క్ పేలవమైన అంపైరింగ్ కారణంగా పెవిలియన్‌కు వెళ్లవలసి వచ్చింది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మెన్ జోర్డాన్ సిల్క్‌పై మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్ ఆడమ్ జంపా రివ్యూ తీసుకున్నాడు. బ్యాట్, బంతి మధ్య సరైన గ్యాప్ ఉందని ఈ సమీక్షలో స్పష్టంగా చూడోచ్చు. కానీ, స్నికోమీటర్ స్పైక్ చూపించింది.

అంపైర్లపై పేలుతోన్న జోకులు..

బ్యాట్, బంతి మధ్య అంతరం ఉన్నప్పటికీ, సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మెన్ జోర్డాన్ సిల్క్ స్నికోమీటర్‌లో స్పైక్ కారణంగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మన్ కూడా ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయాడు. జోర్డాన్ సిల్క్‌ను థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అయితే అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్‌మీడియాలో అభిమానులు మండిపడ్డారు. బిగ్ బాష్‌లోని పేలవమైన అంపైరింగ్‌పై సోషల్ మీడియా అభిమానులు నిరంతరం తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. బిగ్ బాష్ లీగ్ లో అంపైరింగ్ పేరుతో జోక్స్ పేలుస్తున్నారు. అదే సమయంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా, కివీస్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ దీనిపై ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మెల్‌బోర్న్ స్టార్స్‌పై సిడ్నీ సిక్సర్స్ విజయం..

మరోవైపు, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, సిడ్నీ సిక్సర్స్ 6 వికెట్ల తేడాతో మెల్‌బోర్న్ స్టార్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. దీంతో సిడ్నీ సిక్సర్స్‌కు 20 ఓవర్లలో 174 పరుగులు చేయాల్సి వచ్చింది. సిడ్నీ సిక్సర్స్ 19.5 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. అయితే, జోర్డాన్ సిల్క్‌ను ఔట్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. జేమ్స్ విన్స్ 59 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..