Ravichandran Ashwin: అశ్విన్‌కు అరుదైన గౌరవం..కానుకగా 500 బంగారు నాణెలు, కోటి రూపాయలు.. ఎందుకంటే?

|

Mar 17, 2024 | 12:51 PM

ఐపీఎల్ కు ముందు టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Ravichandran Ashwin: అశ్విన్‌కు అరుదైన గౌరవం..కానుకగా 500 బంగారు నాణెలు, కోటి రూపాయలు.. ఎందుకంటే?
Ravichandran Ashwin
Follow us on

ఐపీఎల్ కు ముందు టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టెస్టు ల సిరీస్ లో అశ్విన్ సత్తా చాటాడు. భారత్ తరఫున ఒకే సిరీస్‌లో రెండు ఫీట్లు సాధించిన టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) ఘనంగా సత్కరించింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 100 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసిన అశ్విన్.. అదే సిరీస్‌లో 500 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు. దీంతో అశ్విన్ ను సత్కరించేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ TNCA ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అశ్విన్‌కు 500 బంగారు నాణేల జ్ఞాపికతో సత్కరించారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించినందుకు గానూ 500 బంగారు నాణేలు అందజేయడం విశేషం. దీంతో పాటు ప్రోత్సాహక బహుమతి కింద కోటి రూపాయల నగదను బహూకరించారు. ఈ ఘనతకు గుర్తుగా రవిచంద్రన్‌ అశ్విన్‌ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు.

రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు సాధించాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన 2వ భారతీయుడిగా నిలిచాడు. ధర్మశాలలో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో పాల్గొనడం ద్వారా టీమిండియా తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ప్రత్యేక సాధకుల జాబితాలో అశ్విన్ కూడా చేరాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ విజయాలకు గుర్తింపుగానే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు అశ్విన్‌కు 500 బంగారు నాణేలు కోటి రూపాయల నగదును బహూకరించింది. ఈ స‌న్మాన కార్య‌క్రంలో లెజెండరీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే, బీసీసీఐ అధ్యక్షుడు రోజ‌ర్ బిన్నీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీ‌నివాస‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విన్ భార్య ప్రీతి, ఇద్ద‌రు కూతుళ్ల స‌మ‌క్షంలో బంగారు నాణేలను అందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి