Manoj Tiwary: కష్టం మాది క్రెడిట్స్ ఏమో మీకా? గంబీర్ పై మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

గౌతమ్ గంభీర్‌ను 'కపటపరుడు' అని మనోజ్ తివారీ విమర్శించారు. KKR విజయాల్లో గంభీర్ PRతో అన్ని క్రెడిట్ తీసుకున్నాడని ఆరోపించారు. దీనిపై KKR ఆటగాళ్లు గంభీర్‌కు మద్దతు ప్రకటించారు. నితీష్ రాణా, సునీల్ నరైన్ వంటి ప్రముఖులు గంభీర్‌ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, అతనిపై పాజిటివ్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Manoj Tiwary: కష్టం మాది క్రెడిట్స్ ఏమో మీకా? గంబీర్ పై మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు
Gambhir

Updated on: Jan 09, 2025 | 8:36 PM

గౌతమ్ గంభీర్‌పై సంచలన ఆరోపణలతో మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గంభీర్‌ను ‘కపటపరుడు’ అని అభివర్ణించిన తివారీ, KKR విజయాల్లో అన్ని క్రెడిట్‌ను గంభీర్ తన PR ద్వారా దోచుకున్నాడని విమర్శించాడు. “మేమంతా ఒకటిగా కలిసి కృషి చేశాం. కానీ క్రెడిట్ మాత్రం గంభీర్‌తో పాటు అతని PR టీమ్‌కు వెళ్లింది,” అంటూ తివారీ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై గంభీర్‌కు మద్దతుగా KKR ఆటగాళ్లు నిలిచారు. నితీష్ రాణా, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు గంభీర్‌ను నిస్వార్థ నాయకుడిగా అభివర్ణించారు. “గౌతీ భయ్యా ఎవరికైనా ఆపదలో చక్కని సహాయాన్ని అందిస్తాడు. ట్రోఫీలు అతని పనితీరుకే నిదర్శనం,” అంటూ నితీష్ రాణా స్పందించాడు.

గత సీజన్‌లలో గంభీర్ నాయకత్వం అందించిన సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు కూడా గంభీర్‌ నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. తివారీ వ్యాఖ్యలు కలకలం రేపినా, గంభీర్‌కు ఆటగాళ్ల మద్దతు ఏ మాత్రం తగ్గలేదు.