
New Zealand vs South Africa: క్రికెట్ అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఓ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టిమ్ రాబిన్సన్ న్యూజిలాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో, రాబిన్సన్ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ఇన్నింగ్స్ కేవలం పరుగుల సంఖ్య కాదు, ఇది పోరాట స్ఫూర్తికి, దృఢసంకల్పానికి నిదర్శనంగా నిలిచింది.
మ్యాచ్ ప్రారంభం నుంచి న్యూజిలాండ్ జట్టు ఒత్తిడిలో ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశారు. కీలకమైన వికెట్లు పడుతున్నప్పటికీ, ఒక చివర టిమ్ రాబిన్సన్ క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడాడు. అతని బ్యాటింగ్ కేవలం పరుగులు రాబట్టడమే కాదు, ఇతర బ్యాట్స్‌మెన్‌లకు నమ్మకాన్ని కూడా ఇచ్చింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. కేవలం నాలుగు ఓవర్లలోనే తమ ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. టిమ్ సీఫెర్ట్ 22 పరుగులు చేయగా, డెవాన్ కాన్వే 9 పరుగుల వ్యక్తిగత స్కోరుతో పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. అయితే, టిమ్ రాబిన్సన్ ఒక ఎండ్‌న నిల్చొని 57 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో, దక్షిణాఫ్రికా బౌలర్లందరిపై దూకుడుగా షాట్లు ఆడాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఇది అతని అత్యుత్తమ స్కోరుగా నిలిచింది.
రాబిన్సన్ తన ఇన్నింగ్స్‌లో ఎటువంటి తొందరపాటు లేకుండా, ఓపికగా ఆడాడు. చెత్త బంతులను మాత్రమే శిక్షించి, మంచి బంతులను గౌరవించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు అతని ఏకాగ్రతను చెదరగొట్టడానికి ప్రయత్నించినా, అతను తన లక్ష్యం నుంచి దృష్టి మరల్చలేదు. అతని ప్రతి షాట్ వ్యూహాత్మకంగా, సమయస్ఫూర్తితో కూడి ఉంది. ముఖ్యంగా, అతను ఒత్తిడిలో కూడా కూల్ అండ్ కామ్‌గా ఉంటూ, జట్టును విజయపథంలో నడిపించాడు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 152 పరుగులకే కుప్పకూలింది. విధ్వంసక బ్యాట్స్‌మన్ డెవాల్డ్ బ్రెవిస్ జట్టు తరపున 35 పరుగులు చేసినప్పటికీ తన జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. జార్జ్ లిండే 30 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ జట్టు తరపున మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోధి 2 వికెట్లు పడగొట్టాడు.
ఈ విజయం టిమ్ రాబిన్సన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అతని దృఢసంకల్పం, పోరాట స్ఫూర్తి యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప ఇన్నింగ్స్‌గా గుర్తుండిపోతుంది. న్యూజిలాండ్ అభిమానులు టిమ్ రాబిన్సన్‌కు జేజేలు పలకడంలో ఆశ్చర్యం లేదు. అతను నిజంగానే న్యూజిలాండ్ క్రికెట్‌కు ఒక హీరో..!
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..