IPL 2021: బీసీసీఐపై గుర్రుగా ఉన్న ఆ ముగ్గురు.. ఐపీఎల్-2021 వేదికలపై ఫ్రాంచైజీల నిరసన..

IPL 14th Edition Venues: ఐపీఎల్-2021‌లో లోకల్ ఫైట్ మొదలైంది. ఐపీఎల్​ను కేవలం ఆరు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో తమకు స్థానిక అనుకూలత దూరం అవుతుందని..

  • Sanjay Kasula
  • Publish Date - 1:01 pm, Tue, 2 March 21
IPL 2021: బీసీసీఐపై గుర్రుగా ఉన్న ఆ ముగ్గురు.. ఐపీఎల్-2021 వేదికలపై ఫ్రాంచైజీల నిరసన..

IPL 14th Edition: ఐపీఎల్-2021‌లో లోకల్ ఫైట్ మొదలైంది. ఐపీఎల్​ను కేవలం ఆరు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో తమకు స్థానిక అనుకూలత దూరం అవుతుందని ఫీలవుతున్నాయి. రానున్న ఐపీఎల్‌ను ఆరు వేదికల్లోనే నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయంపై మూడు ఫ్రాంచైజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

సొంతగడ్డపై మ్యాచ్‌లు లేకపోతే స్థానిక అనుకూలత దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో మరోసారి బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి పునరాలోచన చేయాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల యాజమాన్యాలు కోరుతున్నాయి.

భారత్‌లో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఐపీఎల్-14‌ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ద్వారా సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలు పెట్టింది. చెన్నైలో రెండో టెస్టు నుంచి 50 శాతం సామర్థ్యంతో స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతిస్తోంది. చెన్నై, అహ్మదాబాద్‌ టెస్టులకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చిన నేపథ్యంలో అభిమానుల సమక్షంలోనే ఐపీఎల్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా ఆరు వేదికల్లో బయో బబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్‌ వేదికల్ని ముందుగా ఎంపిక చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ముంబైలోనూ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్లాన్  చేస్తోంది.

ప్రస్తుతం నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై హైదరాబాద్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నాయి. అక్కడి స్థానికుల నంచి కూడా భారీగా డిమాండ్ ఉంది. మూడు ఫ్రాంచైజీలు విడివిడిగా బీసీసీఐ సీఈఓ హేమంగ్‌ అమిన్‌ దృష్టికి తీసుకెళ్లాయి. వేదికలపై బోర్డు పునరాలోచించాలంటూ మూడు ఫ్రాంచైజీలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కూడా భావిస్తున్నాయి. ఐపీఎల్‌ ఆతిథ్యం కోసం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం.. కరోనా రెండో దశ ప్రభావం కనిపిస్తుండటాన్ని మూడు ఫ్రాంచైజీలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలు లేని.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలంటూ సన్‌రైజర్స్‌ గట్టిగా చెబుతోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సైతం హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలంటూ బీసీసీఐ, ఐపీఎల్‌ కార్యవర్గ సభ్యులకు ట్విట్టర్​‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే మ్యాచ్‌లకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

First Cricket Star to Hit: విరాట్.. విరాట్ స్వరూపం.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు…

Maoist attack: గన్స్‌, ల్యాండ్ మైన్స్‌తో కాదు.. బాణం బాంబులతో దాడి.. మావోయిస్టుల దుశ్చర్య..