AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli Instagram Recorded : విరాట్.. విరాట్ స్వరూపం.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు…

Virat Kohli: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సందే.

Kohli Instagram Recorded : విరాట్.. విరాట్ స్వరూపం.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు...
Virat Kohli - the first cricket star to hit 100 million followers on Instagram
Sanjay Kasula
|

Updated on: Mar 02, 2021 | 11:31 AM

Share

India captain Virat Kohli: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సందే. రికార్డుల మోత మోగాల్సిందే. అయితే ఇప్పుడు మరో ఫార్మాట్ ఏదైనా మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇదే విరాట్ స్వరూపం.. ఇదంతా క్రికెట్ మైదానంలోని రికార్డులు.

ఇప్పుడు సెంచరీతో చెలరేగిపోయాడు. మ్యాచ్ లేకుండానే పరుగులు ఎలా చేశాడు.. అనేదే మీ డౌట్.. కోహ్లీ కొట్టింది గ్రౌండ్‌లో కాదు సోషల్ మీడియాలో.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలోనూ తన రికార్డును సొంతం చేసకున్నాడు. అతని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 100 మిలియన్‌ దాటేసింది.

భారత్‌ తరఫున ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సెలెబ్రిటీగా సరికొత్త రికార్డును విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి గత కొంతకాలంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రియాంక చోప్రా, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె గట్టి పోటీ ఇచ్చారు. కానీ.. తాజాగా వారందరినీ వెనక్కి నెట్టేసిన కోహ్లీ ముందుకు దూసుకుపోయాడు. తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

ప్రియాంక చోప్రా ఫాలోయర్ల సంఖ్య 60 మిలియన్‌కాగా.. దీపికా పదుకొణె‌ని 53.3 మిలియన్‌ మంది ఉన్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇన్‌స్టా‌గ్రామ్‌లో 51.2 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలోయర్ల ఉన్న స్పోర్ట్స్‌పర్సన్ జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. విరాట్ కోహ్లీ కంటే ముందు క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, నెయ్‌మార్ ఉన్నారు. రొనాల్డో ఫాలోయర్ల సంఖ్య 500 మిలియన్‌.

ఇవి కూడా చదవండి

First Corona Case in Telangana: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు… తెలంగాణలో కరోనా మహమ్మారి జాడ ..

India vs England: బయో బబుల్ ఎఫెక్ట్.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్..