IPL 2021: బెడిసికొడుతోన్న ప్లాన్-బీ.. వేదికలపై ఫ్రాంచైజీల అభ్యంతరం.. ఐపీఎల్ పరిస్థితి ఏంటి.!
IPL 2021 Venue: ఐపీఎల్ 2021ను ముంబైలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికను సిద్దం చేసింది. అయితే మహారాష్ట్రలో...
IPL 2021 Venue: ఐపీఎల్ 2021ను ముంబైలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికను సిద్దం చేసింది. అయితే మహారాష్ట్రలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వెనక్కి తగ్గిన బీసీసీఐ.. దేశవ్యాప్తంగా మరో ఆరు వేదికలను తాత్కాలికంగా ఖరారు చేసింది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలలో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్స్, ఫైనల్‌ను నిర్వహించేందుకు ప్లాన్-బీ సిద్దం చేస్తోంది. ఇక ముంబైను ప్రత్యామ్నాయ వేదికగా బీసీసీఐ ఉంచింది. అయితే, తాజాగా బీసీసీఐ ఎంపిక చేసిన ఆరు వేదికలపై మూడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఒక్క జట్టుకు కూడా హోం గ్రౌండ్ లేదని.. ఇతర మైదానాలను ఎంపిక చేశారని పరోక్షంగా విమర్శించారు. ఇక ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ మొతేరా గ్రౌండ్‌ను ఎంపిక చేయడాన్ని పరోక్షంగా విభేదించారు. హోం గ్రౌండ్ కానీ స్టేడియాల్లో తమకు ఎలాంటి ప్రయోజనం లభించదని ఆయా ఫ్రాంచైజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. బీసీసీఐ నిర్ణయం పరోక్షంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ) లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్.. ఐపీఎల్ 2021 వేదికల్లో హైదరాబాద్‌ను చేర్చాలని బీసీసీఐని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!
హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!