IPL 2022: ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు బాదింది వీరే.. టాప్ 10లో ఎవరున్నారంటే?

|

Apr 30, 2022 | 4:40 AM

ప్రస్తుత ఐపీఎల్ 2022లోనూ ఇదే పోటీ కనిపిస్తోంది. అలాంటి ఓ రికార్డును ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్టులో ఎవరున్నారో తెలుసుకుందాం.

IPL 2022: ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు బాదింది వీరే.. టాప్ 10లో ఎవరున్నారంటే?
Ipl 2022
Follow us on

ఐపీఎల్(IPL) కెరీర్‌లో ఎంతోమంది రికార్డులు నెలకొల్పారు. అందులో కొన్ని రికార్డులు ఎంతో ప్రత్యేకమైనవి. అయితే, ఈ రికార్డులో చేరాలని ప్లేయర్లు పోటీపడుతుంటారు. ఈ క్రమంలో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుత ఐపీఎల్ 2022(IPL 2022)లోనూ ఇదే పోటీ కనిపిస్తోంది. అలాంటి ఓ రికార్డును ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్టులో ఎవరున్నారో తెలుసుకుందాం. ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా శిఖర్ ధావన్(Shikhar Dhawan) రికార్డు సృష్టించాడు. 200 మ్యాచ్‌ల్లో 684 ఫోర్లు బాదేశాడు. ఈ జాబితాలో రెండో ఆటగాడు విరాట్ కోహ్లీ నిలిచాడు. 216 మ్యాచ్‌ల్లో 557 ఫోర్లు కొట్టాడు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో నిలిచాడు. 155 మ్యాచ్‌ల్లో 550 ఫోర్లు బాది 3వ స్థానంలో ఉన్నాడు.

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 221 మ్యాచ్‌ల్లో 508 ఫోర్లు కొట్టి, నాలుగో స్థానంలో నిలిచాడు. మిస్టర్ IPL సురేష్ రైనా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 205 మ్యాచ్‌ల్లో 506 ఫోర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు. 154 మ్యాచ్‌ల్లో 492 ఫోర్లు కొట్టి, ఆరో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో CSK స్టార్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప కూడా ఉన్నాడు. 201 మ్యాచ్‌ల్లో 481 ఫోర్లు కొట్టాడు. అజింక్య రహానే 156 మ్యాచ్‌ల్లో 428 ఫోర్లు బాది 8వ స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో రహానే KKR జట్టుతో ఆడుతున్నాడు. ఈ జాబితాలో దినేష్ కార్తీక్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 222 మ్యాచ్‌ల్లో 418 ఫోర్లు అతని ఖాతాలో చేరాయి. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ చివరి స్థానంలో అంటే 10వ స్థానంలో నిలిచాడు. మొత్తం 184 మ్యాచ్‌ల్లో 413 ఫోర్లు తన బ్యాట్ నుంచి వచ్చాయి.

Also Read: IPL 2022: స్టేడియం వద్దకు వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన గౌతమ్ గంభీర్..

IPL 2022: ఒకసారి జరిమానా విధించినా.. మళ్లీ నో బాల్‌ విషయంలో అంపైర్‌తో గొడవ..!