Team India: టీమిండియా టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం దరఖాస్తులు.. ఆ బ్రాండ్‌లపై నిషేధం.. లిస్టులో ఏమున్నాయంటే?

WI vs IND: జులై 12 నుంచి భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి ముందు టీమిండియాకు కొత్త స్పాన్సర్‌షిప్ లభిస్తుందని భావిస్తున్నారు.

Team India: టీమిండియా టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం దరఖాస్తులు.. ఆ బ్రాండ్‌లపై నిషేధం.. లిస్టులో ఏమున్నాయంటే?
Bcci
Follow us
Venkata Chari

|

Updated on: Jun 15, 2023 | 9:35 PM

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం టీమ్ ఇండియా టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం టెండర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. BYJU’Sతో BCCI ఒప్పందం గత ఆర్థిక సంవత్సరంలో ముగిసింది. అందువల్ల కొత్త స్పాన్సర్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. జాతీయ జట్టు ప్రధాన స్పాన్సర్ హక్కులను పొందేందుకు BCCI ప్రఖ్యాత సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తుంది. ఈ బిడ్ డాక్యుమెంట్ పొందడానికి 5 లక్షల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం తిరిగి చెల్లించరు. అంతేకాకుండా జూన్ 26లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సెక్రటరీ జైషా ఓ ప్రకటనలో తెలిపారు.

బిడ్‌ను సమర్పించాలనుకునే ఆసక్తిగల ఏదైనా కంపెనీ తప్పనిసరిగా ITTని కొనుగోలు చేయాలి (టెండర్‌కు ఆహ్వానం). అయితే, ITTలో నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసి, అందులో సూచించిన ఇతర నిబంధనలు, షరతులకు లోబడి ఉన్నవారు మాత్రమే బిడ్‌కు అర్హులు అని స్పష్టం చేసింది.

అలాగే, కేవలం ITT కొనుగోలు కోసం వేలం వేయడానికి ఏ కంపెనీ లేదా వ్యక్తి అనుమతించబడరు. బదులుగా, డాక్యుమెంట్‌లో పేర్కొన్న నిబంధనలు, షరతులకు లోబడి ఉంటేనే ఆ టెండర్‌కు అర్హత పొందుతుందని జైషా స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

దీనికి ప్రధాన కారణం.. భారత జట్టుకు స్పాన్సర్‌గా ఉన్న బైజూస్ కంపెనీ పన్ను ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల అప్పు ఉంది. దీనికి తోడు, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై భారత ఐటీ శాఖ బైజూస్ కార్యాలయం, ఇతర ప్రదేశాలపై దాడులు చేసింది. ఈ కారణంగానే ఈసారి టెండర్ల పూర్తి సమాచారాన్ని సేకరించి స్పాన్సర్ షిప్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.

అలాగే కొన్ని బ్రాండ్లు టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి మినహాయించింది. దీని ప్రకారం, టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం దరఖాస్తు చేయకుండా నిషేధించిన బ్రాండెడ్ వర్గాల జాబితాను BCCI షేర్ చేసింది.

(1) అథ్లెయిజర్, స్పోర్ట్స్ వేర్ తయారీదారులు (ఇప్పటికే అడిడాస్ కంపెనీ టీమ్ ఇండియా కిట్‌ను స్పాన్సర్ చేస్తోంది. కాబట్టి, క్రీడా దుస్తులు, ఫ్యాషన్ దుస్తులు తయారీదారులు మినహాయించింది.)

(2) ఆల్కహాల్ ఉత్పత్తులు

(3) బెట్టింగ్

(4) క్రిప్టోకరెన్సీ

(5) రియల్ మనీ గేమింగ్ (ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ కాకుండా)

(6) పొగాకు ఉత్పత్తులు

(7) కంపెనీ/ప్రకటనలో అశ్లీలత, పబ్లిక్ నైతికతలను దెబ్బ తీసే అంశాలు.

పైన పేర్కొన్న ఏ ప్రకటనలు, కంపెనీల నుంచి BCCI స్పాన్సర్‌షిప్‌ను అంగీకరించదు. జూలై 12 నుంచి భారత్-వెస్టిండీస్ సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి ముందు టీమ్ ఇండియాకు కొత్త స్పాన్సర్‌షిప్ లభిస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..