IPL Auction: 9 మ్యాచ్‌ల్లో 445 పరుగులు.. 19 ఏళ్లకే రూ. 14 కోట్లతో ప్రైజ్ మనీ.. అసలెవరీ కార్తీక్ శర్మ?

Who is Kartik Sharma: ధోని వారసుడి కోసం వెతుకుతున్న చెన్నై సూపర్ కింగ్స్, కార్తీక్ శర్మలో ఆ లక్షణాలను చూసి ఉండవచ్చు. 19 ఏళ్ల వయసులో రూ. 14.20 కోట్లు పలికిన ఈ 'రాజస్థాన్ రాయల్' ఐపీఎల్‌లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

IPL Auction: 9 మ్యాచ్‌ల్లో 445 పరుగులు.. 19 ఏళ్లకే రూ. 14 కోట్లతో ప్రైజ్ మనీ.. అసలెవరీ కార్తీక్ శర్మ?
Kartik Sharma

Updated on: Dec 16, 2025 | 5:53 PM

ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల యువ వికెట్ కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మను ఏకంగా రూ. 14.20 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని) ఆటగాడిగా కార్తీక్ శర్మ (మరో ఆటగాడు ప్రశాంత్ వీర్‌తో కలిసి) రికార్డు సృష్టించాడు.

ఎవరీ కార్తీక్ శర్మ? (Who is Kartik Sharma?)..

రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్, వికెట్ కీపర్‌గా పేరుగాంచిన ఈ కార్తీక్ శర్మ.. భారీ షాట్లు కొట్టడంలో దిట్ట. ఇతని క్లీన్ హిట్టింగ్ చూసి కెవిన్ పీటర్సన్, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు ప్రశంసించారు. ఇతని ఆటతీరు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీల నుంచి ప్రేరణ పొందింది.

వేలంలో ఏం జరిగింది?..

కార్తీక్ శర్మ పేరు తెరపైకి రాగానే ఫ్రాంచైజీల మధ్య యుద్ధం మొదలైంది. కేవలం రూ. 30 లక్షల కనీస ధరతో (Base Price) వేలానికి వచ్చాడు. ముంబై ఇండియన్స్ (MI) తొలుత బిడ్ వేయగా, లక్నో (LSG),  కోల్‌కతా (KKR) పోటీలోకి వచ్చాయి. ధర రూ. 5 కోట్లు దాటిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా ప్రయత్నించినప్పటికీ, చివరికి CSK పట్టువదలక రూ. 14.20 కోట్ల భారీ ధరకు అతన్ని సొంతం చేసుకుంది.

కార్తీక్ శర్మ గణాంకాలు & రికార్డులు (Stats & Records)..

ఈ భారీ ధరకు ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్‌లో అతని తాజా ప్రదర్శనలే కారణం..

రంజీ ట్రోఫీ అరంగేట్రం: తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లోనే (ఉత్తరాఖండ్‌పై) అద్భుతమైన శతకం (113 పరుగులు) సాధించి సంచలనం సృష్టించాడు.

టీ20 విధ్వంసం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున ఆడుతూ, 12 మ్యాచ్‌లలో 164 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశాడు. ఇందులో 28 సిక్సర్లు ఉండటం విశేషం.

లిస్ట్-A: లిస్ట్-A క్రికెట్‌లో కేవలం 9 మ్యాచ్‌లలోనే 445 పరుగులు చేసి రాజస్థాన్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ధోని వారసుడి కోసం వెతుకుతున్న చెన్నై సూపర్ కింగ్స్, కార్తీక్ శర్మలో ఆ లక్షణాలను చూసి ఉండవచ్చు. 19 ఏళ్ల వయసులో రూ. 14.20 కోట్లు పలికిన ఈ ‘రాజస్థాన్ రాయల్’ ఐపీఎల్‌లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.