సచిన్ టెండూల్కర్ జీవితం, అతని అంకితభావం, విజయం వెనుక ఉన్న కఠోర శ్రమ గురించి తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్ మైదానంలో ప్రారంభమైన అతని ప్రయాణం ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి చేరడం ఒక చరిత్ర. ఆ మైదానంలోనే సచిన్ తన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ తీసుకొని తన ఆటతీరుకు మాస్టర్‌టచ్ అందుకున్నాడు.
అచ్రేకర్ సచిన్‌కు ఒక ప్రత్యేకమైన పరీక్ష పెట్టేవారు. స్టంప్స్‌పై 1 రూపాయి నాణెం ఉంచి, సచిన్ అవుట్ కాకుండా ప్రాక్టీస్ చేస్తే, ఆ నాణెం బహుమతిగా పొందే అవకాశం ఉండేది. ఈ చిన్న పరీక్షే సచిన్‌లో అపారమైన ఏకాగ్రతను పెంచింది. ప్రతి రోజు కఠోర శ్రమతో, ఆ నాణేలను గెలుచుకోవడంలో సచిన్ చూపిన ప్రతిజ్ఞ అతన్ని ఒక లెజెండ్‌గా మార్చింది. ఇవి ఇప్పటికీ అతని ప్రియమైన సమ్మానాలుగా ఉంటాయి.
అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ అనేక రికార్డులు లిఖించాడు. 100 అంతర్జాతీయ సెంచరీలతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్‌లో 49 సెంచరీలు, టెస్టుల్లో 51 సెంచరీలు సాధించి, మొత్తం 15921 టెస్టు పరుగులు, 18426 వన్డే పరుగులతో అతని కృషి మైలురాయిలను దాటింది.
సచిన్ సాధించిన తొలి వన్డే డబుల్ సెంచరీ చరిత్ర సృష్టించి, క్రికెట్ గాడ్‌గా గుర్తింపు పొందాడు. కానీ ఈ విజయాల వెనుక ఉన్న సెక్రెట్ ఆయన బాల్యంలోనే నేర్చుకున్న పట్టుదల. రమాకాంత్ అచ్రేకర్ ద్వారా పొందిన ప్రేరణతో, 1 రూపాయి నాణేలు మాత్రమే కాదు, కోట్లాది హృదయాలను గెలుచుకున్నాడు.
ఈ కథ సచిన్ టెండూల్కర్ మాత్రమే కాదు, కఠోర శ్రమ, పట్టుదల, నిజాయితీకి జీవంత సాక్ష్యం. ప్రతి యువ క్రికెటర్‌కు ఇది ప్రేరణతో కూడిన కధనం.