Cricket: 15 బంతుల్లోనే 50 రన్స్.. 7 సిక్స్‌లు, 264 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్ల ఊచకోత.. హండ్రెడ్ లీగ్‌లో సంచలనం
The Hundred Cricket League 2022: ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ, డుప్లెసిస్ కంటే మరొక యంగ్ ప్లేయర్ హైలెట్‌గా నిలిచాడు. అతనే ఇంగ్లండ్‌కు చెందిన ఆడమ్ రోసింగ్‌టన్ (Adam Rossington). దీనికి కారణం అతను ఆడిన విధ్వంసకర ఇన్నింగ్సే.
The Hundred Cricket League 2022: సాధారణంగా ఒక మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నట్లైతే అభిమానుల దృష్టంతా వారిపైనే ఉంటుంది. మరొకరి గురించి చర్చ జరగదు. అంతర్జాతీయ క్రికెట్‌లో తమ దేశాల తరఫున ఈ ఇద్దరు దిగ్గజాలు ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే ఒక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా దిగారు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ క్రికెట్ టోర్నీ-2022లో భాగంగా నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, లండన్ స్పిరిట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కరమైంది. అయితే ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ, డుప్లెసిస్ కంటే మరొక యంగ్ ప్లేయర్ హైలెట్‌గా నిలిచాడు. అతనే ఇంగ్లండ్‌కు చెందిన ఆడమ్ రోసింగ్‌టన్ (Adam Rossington). దీనికి కారణం అతను ఆడిన విధ్వంసకర ఇన్నింగ్సే.
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నమెంట్ రెండో సీజన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. ఆగస్టు 14 ఆదివారం నాడు ఈ దూకుడు కాస్తా వేరే లెవెల్‌కి చేరుకుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం వేదికగా నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్, లండన్ స్పిరిట్ పురుషుల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ల నుంచి పరుగులు వెల్లువలా వచ్చాయి. సూపర్‌చార్జర్స్ తరఫున ఫాఫ్ డుప్లెసిస్ 35 బంతుల్లో 56 పరుగులు చేయగా, ఆడమ్ హోసీ కూడా 14 బంతుల్లో 30 పరుగులు చేశాడు. దీంతో సూపర్ ఛార్జర్స్ నిర్ణీత100 బంతుల్లో 143 పరుగులు చేసింది.
Played, @Rossington17 ???
53 runs off FIFTEEN balls – that’s going to take some beating!#TheHundred pic.twitter.com/Vl5qacSTT0
— The Hundred (@thehundred) August 14, 2022
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఆఫ్ ది హండ్రెడ్
ఇక లండన్ జట్టులో గ్లెన్ మాక్స్‌వెల్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడంతో అందరి దృష్టి వారిపైనే ఉంది. అందుకు తగ్గట్లే మ్యాక్సీ కూడా చెలరేగి ఆడాడు. అయితే అతని కంటే ముందు ఆడమ్ రోసింగ్టన్ తుఫాను సృష్టించాడు. 29 ఏళ్ల ఈ ఇంగ్లిష్ బ్యాటర్ డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, డ్వేన్ బ్రావో వంటి అనుభవజ్ఞులైన బౌలర్లను చిత్తు చిత్తు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ది హండ్రెడ్ చరిత్ర లీగ్ అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 25 బంతుల్లో 7 సిక్సర్లు, 3 ఫోర్ల సహాయంతో 66 పరుగులు చేసిన ఆడమ్.. చివరి10 బంతుల్లో 54 పరుగులు చేయడం విశేషం. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టడం రోసింగ్టన్ ఇన్నింగ్స్‌లో హైలెట్. రోసింగ్టన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్సీ 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. తద్వారా 82 బంతుల్లోనే జట్టుకు 7 వికెట్ల విజయాన్ని అందించాడు.
Fifties don’t come much faster than that! ⏩
? London Spirit’s @Rossington17 is your @CazooUK Match Hero#TheHundred pic.twitter.com/l1OeKRs8lk
— The Hundred (@thehundred) August 14, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..