Hyderabad: ఓ వైపు టికెట్ విక్రయాల్లో గోల్‌మాల్‌పై ఫ్యాన్స్ రగిలిపోతుంటే.. మరోవైపు ఉప్పల్ స్టేడియం దగ్గర యధేచ్చగా బ్లాక్ టికెట్ల దందా నడుస్తోంది. ఒక్కో టికెట్‌పై మూడింతలు వసూలు చేస్తున్నారు బ్లాక్ రాయుళ్లు. సమాచారం అందడంతో బ్లాక్ టికెట్ విక్రయాలపై పోలీసుల నిఘా పెట్టారు. స్టేడియం దగ్గర మఫ్టీలో కాపు కాస్తున్నారు. ఇంకోవైపు కన్ఫర్మేషన్ ఉన్నవారికి మ్యాచ్ టికెట్ల పంపిణీ చేస్తున్నారు. జింఖానా గ్రౌండ్‌లో HCA ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు. రేపు, ఎల్లుండి ఫిజికల్ టికెట్ల పంపిణీ చేస్తారు. కన్ఫర్మేషన్ మెయిల్ ఉన్నవారే రావాలని సూచించారు. దీంతో ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారు, జింఖానా స్టేడియం వద్దకు భారీగా చేరుకున్నారు. కానీ, పోలీసులు మాత్రం ఎవ్వరినీ లోపలికి పంపడం లేదు. మరోవైపు, హెచ్‌సీఏ మాత్రం లైవ్‌గా టికెట్లు అమ్మడం లేదని, బోర్డులు పెట్టడంతో, ఫ్యాన్స్ నిరాశగా వెనుదిరుగుతున్నారు. అయితే, ఆన్లైన్ మ్యాచ్ టికెట్ దారులకు ఊరట కలిగించేలా పోలీసులు ఓ ప్రకటన చేశారు. Paytmలో టికెట్ బుక్ చేసుకున్న ఫాన్స్‌కు కాసేపట్లో టికెట్ల పంపిణీ చేయనున్నట్లు, క్యూ లైన్ లో నిల్చోవాలని పోలీసులు సూచించారు. 11 గంటల తర్వాత ఆన్లైన్ టికెట్స్ ఇవ్వనున్నట్లు HCA ప్రకటించింది. కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే జింఖాన మైదానంలోకి రావాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆఫ్ లైన్ టికెట్స్ కోసం గ్రౌండ్ వైపు ఎవరూ రావొదహాని కోరుతున్నారు.
అజహరుద్దీన్.. మాకేంటి ఈ పరేషాన్? ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి వస్తున్న మాట ఇదే. HCAని ఆగమాగం చేసి, పాలనలోనూ రిమార్కులు తెచ్చున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో భాగంగా, మూడో టీ20 హైదరాబాద్‌లో జరగనుంది. అయితే, హెచ్‌సీఏ మాత్రం తన తీరుతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇవే మ్యాచ్‌లు దేశంలో మరో రెండు చోట్ల జరిగాయి. అక్కడా టికెట్లను ఆయా క్రికెట్ అసోసియేషన్లు అమ్మాయి. కానీ, అక్కడెలాంటి గొడవలు జరగలేదు. ఇక్కడ మాత్రం సినిమా లెవల్‌లో రచ్చ జరిగింది. ఏకంగా ఫ్యాన్స్‌ను ఆస్పత్రుల పాలుచేసింది.
టికెట్లు.. లెక్కలు ఇవే..
స్టేడియం కెపాసీటీ – 55వేలు
అనుమతించేది – 34 వేలు
ఆటగాళ్లు, స్పాన్సర్లకు – 4,500 వేలు
అమ్మాల్సినవి – 29,500 వేలు
ఆఫ్‌లైన్‌లో అమ్మినవి – 2000 వేలు
లేక లేక బోర్డు దయతలచి హైదరాబాద్‌కు ఒక మ్యాచ్ కేటాయిస్తే.. దాని టికెట్ల అమ్మకాలపై జరిగిన రభసతో జాతీయ స్థాయిలో HCA పరువు పోయింది. గొడవ తర్వాత అజహర్ మీడియా ముందుకు వచ్చారు. తడిపోడి మాటలు చెప్పి ఎస్కేప్ అయ్యారు. ఇంత గందరగోళానికి కారణాలేంటో?ఈ వివాదాలకు మధ్యాహ్నం పెట్టబోయే ప్రెస్‌మీట్‌లో అజ్జూ ఎలాంటి సంజాయిషీ ఇస్తారో అన్నది ఆసక్తిగా మారింది.
HCAలోకి అజహర్ వస్తే క్రికెట్‌లో పెను మార్పులు వస్తాయని చేశామని.. కానీ, అన్నీ వివాదాలే తీసుకొస్తున్నారని చాలామంది విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. అజహర్ మాత్రం అసలు టిక్కెట్లే లేవని, మొత్తం అయిపోయాయని చెబుతున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ఈ పరిస్థితికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురవారెడ్డి మాట్లాడుతూ, టీ-20 మ్యాచ్ టికెట్ల విక్రయంలో రూ. 40 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.
మరోవైపు జింఖానాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై హెచ్‌సీఏతో పాటు అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌పై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులు, బేగంపేట ఎస్సై ప్రమోద్‌ల ఫిర్యాదు మేరకు 420, 21, 22/76 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.