Azharuddin : అజార్ హైదరాబాద్‌ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారన్న లక్ష్మినారాయణ, మళ్లీ తెరపైకి మ్యాచ్‌ ఫిక్సింగ్‌

|

Mar 21, 2021 | 9:23 PM

Yendala Vs Azharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ కేసు దర్యాప్తును..

Azharuddin : అజార్ హైదరాబాద్‌ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారన్న లక్ష్మినారాయణ, మళ్లీ తెరపైకి మ్యాచ్‌ ఫిక్సింగ్‌
Azar
Follow us on

Yendala Vs Azharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ కేసు దర్యాప్తును సీబీఐ పునర్విచారణ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలుస్తామన్నారు తెలంగాణ క్రికెట్ అసోసిషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ. క్లీన్ చిట్‌ లేని వ్యక్తి హైదరాబాద్‌ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ముస్తాక్ ఆలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ సెలక్షన్‌లో అనేక అవకతవకలు జరిగాయని లక్ష్మినారాయణ విమర్శించారు.

అజరుద్దీన్ కేవలం ఎన్నికల్లో పోటీ చేయడానికి కోర్టు నుంచి తాత్కాలిక అనుమతి మాత్రమే తీసుకున్నారని యెండల అన్నారు. తనపై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాలు నుంచి అజర్ తప్పించు కోలేరన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కేస్‌లో BCCI నుంచి అజర్‌కి క్లీన్ చిట్ లభించలేదని గుర్తుచేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ నుండి అజర్ కి క్లీన్ చిట్ కూడా లభించలేదని ఆయన చెప్పారు. మొన్న జరిగిన ముస్తాక్ ఆలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్ లో కూడా అనేక అవకతవకలు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. లీగ్ మ్యాచ్ లో మంచి ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు చోటు లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.

“క్రికెట్ జన్మ నిచ్చిన హెచ్ సి ఏ లో ప్రక్షాళన చేసి.. ప్రతిభ గల క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం మానేసి… గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేపనుల్లో ముందున్న మా పై విమర్శలు చేస్తావా? అని యెండల, అజర్ ను విమర్శించారు. సెలెక్టర్లు చేస్తున్న అక్రమాలపై క్రికెటర్ల తల్లిదండ్రులు మానవహక్కుల కమీషన్ కి ఫిర్యాదు చేయలేదా..? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి అజర్ చేసింది శూన్యం… BCCI నుండి వస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయి….గత మూడేళ్ళుగా హెచ్ సి ఏ ఆడిటింగ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు. సీబీఐ కేసులలో ఉన్న ఇలాంటి వ్యక్తి ..తెలంగాణ గ్రామీణ క్రికెటర్ల కు న్యాయం చేయగలడా.. ? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత 30ఏళ్ల నుండి ఒక్క గ్రామీణ ప్లేయర్ కూడా రంజీ ట్రోఫీ లో ఆడించలేకపోయింది.” అంటూ యెండల తీవ్ర అజర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Slams Azar

Read also : go maha gharjana : ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో “గో మహా గర్జన” : యుగతులసి ఫౌండేషన్ చైర్మన్