వెస్టిండీస్‌లో పుట్టి, టీమిండియా తరపున అరంగేట్రం.. తొలిసారి తమిళనాడుకు రంజీని అందించిన బెస్ట్ ఆల్ రౌండర్ ఎవరో తెలుసా?

Robin Singh: దేశీయ క్రికెట్‌లో తమిళనాడు తరపున ఆడి, 33 సంవత్సరాల కరువును అంతం చేస్తూ 1988 లో రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా తమిళనాడును నిలిపాడు.

వెస్టిండీస్‌లో పుట్టి, టీమిండియా తరపున అరంగేట్రం.. తొలిసారి తమిళనాడుకు రంజీని అందించిన బెస్ట్ ఆల్ రౌండర్ ఎవరో తెలుసా?
Rabin Singh

Robin Singh Birthday: అతను జన్మించిన దేశానికి వ్యతిరేకంగా టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారత క్రికెట్‌లో ఆనాడు కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. అలాగే ఆర్థికశాస్త్రంలోనూ నైపుణ్యం సాధించాడు. ఆయనెవరంటే..రాబిన్ సింగ్. వెస్టిండీస్‌లో జన్మించాడు. కానీ, రాబిన్ సింగ్ భారతదేశం తరపున క్రికెట్ ఆడాడు. వెస్టిండీస్‌లో పుట్టి భారత్ తరపున క్రికెట్ ఆడిన మొదటి ప్లేయర్‌గా నిలిచాడు. ఈ రోజు రాబిన్ సింగ్ పుట్టిన రోజు. 1963 సెప్టెంబర్ 14న ట్రినిడాడ్‌లో రాబిన్ సింగ్ జన్మించాడు. ఈ రోజు ఆ ఆటగాడి 58 వ పుట్టినరోజు. పూర్తి పేరు రవీంద్ర రాబిన్ సింగ్. కానీ, భారత క్రికెట్‌కు వచ్చిన తర్వాత, అతను కేవలం రాబిన్ సింగ్‌గానే ఎక్కువ గుర్తింపు పొందాడు. 90 వ దశకంలో, రాబిన్ సింగ్ క్రికెట్‌లో రెండు విషయాలకు ప్రసిద్ధి గాంచాడు. వన్డేల స్పెషలిస్ట్ ప్లేయర్‌గా, బెస్ట్ ఫీల్డర్‌గా ఎదిగాడు.

ట్రినిడాడ్‌లో జన్మించిన రాబిన్ సింగ్ భారత క్రికెట్‌లో ఎలా ఎంట్రీ పొందారో తెలుసా..? 1984 లో అతని తల్లిదండ్రులు భారతదేశానికి వలస వచ్చారు. ఆ టైంలో రాబిన్ సింగ్ ట్రినిడాడ్, టొబాగో పౌరసత్వాన్ని విడిచిపెట్టి క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకున్నాడు. అక్కడి క్రికెట్‌లో కీలకంగా ఎదిగాడు. దీంతో అతనికి టీమ్ ఇండియా జెర్సీ ధరించే అవకాశం వచ్చింది. మొదట దేశీయ క్రికెట్‌లో తమిళనాడు తరపున ఆడటం ప్రారంభించాడు. అలాగే 33 సంవత్సరాల కరువును అంతం చేస్తూ 1988 లో రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలపడంలో కీలకంగా మారాడు. దీంతో తమిళనాడు కెప్టెన్సీతో పాటు, రాబిన్ సింగ్ సౌత్ జోన్‌కు కూడా నాయకత్వం వహించాడు.

వెస్టిండీస్‌పై అంతర్జాతీయ అరంగేట్రం
ఆ తర్వాత 1989, మార్చి 11 న రాబిన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో భారత టీంలోకి అరంగేట్రం చేశాడు. అతను జన్మించిన వెస్టిండీస్‌‌కు వ్యతిరేకంగా ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ, వెస్టిండీస్‌తో సిరీస్ తర్వాత రాబిన్ సింగ్ జట్టు నుంచి దూరమయ్యాడు. ఆపై 7 సంవత్సరాలు జట్టులోకి తిరిగి రాలేదు. 1996 లో టైటాన్ కప్ కోసం అతను మరోసారి జట్టులోకి వచ్చాడు. తన స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశాన్ని ఈసారి మాత్రం వదులుకోలేదు. ఆ తర్వాత అతను 2001 వరకు ఆల్ రౌండర్‌గా జట్టుతో అనుబంధాన్ని కొనసాగించాడు. 1999 వరల్డ్ కప్‌లో భారత జట్టులో భాగంగా ఉన్నాడు. టౌంటన్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. రాబిన్ సింగ్ తన కెరీర్‌లో మొత్తం 136 వన్డేలు ఆడాడు. వీటిల్లో 2336 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 100 పరుగులుగా నమోదైంది. ఇది 1997-98 సంవత్సరంలో కొలంబోలో శ్రీలంకపై సాధించాడు.

క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత..
మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ అందుకున్నాడు. రాబిన్ సింగ్ 2004 లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత కోచ్ బాధ్యతను కూడా తీసుకున్నాడు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా మారడానికి ముందు, అతను భారత జూనియర్ ఏ జట్టు కోచ్‌గా కూడా పనిచేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సీపీఎల్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభ సంవత్సరాల్లో అతను డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు కూడా శిక్షణ అందించాడు.

Also Read: Royal Challengers Bangalore: నేను వృద్ధుడిని, నాకు విశ్రాంతి కావాలంటోన్న విరాట్ కోహ్లీ టీం ప్లేయర్..!

IPL 2021: వీరంతా కీలక బౌలర్లే.. భారీ ప్రైజ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ.. కానీ, నెట్ బౌలింగ్‌కే పరిమితం.. వారెవరంటే?

Click on your DTH Provider to Add TV9 Telugu