Royal Challengers Bangalore: నేను వృద్ధుడిని, నాకు విశ్రాంతి కావాలంటోన్న విరాట్ కోహ్లీ టీం ప్లేయర్..!
ఈ 37 ఏళ్ల క్రికెటర్ ఆర్‌సీబీ ప్రధాన ఆటగాళ్లలో ఒకరు. ఈ జట్టు టైటిల్ కరువును అంతం చేయాల్సి వస్తే ఈ ప్లేయర్ కీలకంగా మారాల్సిందే.
AB De Villiers: ఏబీ డివిలియర్స్ చాలా కాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం ఐపీఎల్ 2021 కోసం యూఏఈలో ఉన్నాడు. అతను విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడు ఆడుతున్నాడు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, డివిలియర్స్ తనను తాను వృద్ధుడిగా భావించాడు. పొట్టి క్రికెట్ అవసరాలను తీర్చడానికి తనకు విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడు. ఈ 37 ఏళ్ల క్రికెటర్ ఆర్‌సీబీ ప్రధాన ఆటగాళ్లలో ఒకరు. ఈ జట్టు టైటిల్ కరువును అంతం చేయాల్సి వస్తే, డివిలియర్స్ కీలంగా ఆడాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు. భారతదేశంలో జరిగిన ఐపీఎల్ ప్రథమార్ధంలో డివిలియర్స్ ప్రదర్శన బాగుంది. యూఏఈ పిచ్‌లపై కూడా ఏబీడీ సందడి చేయాలని కోహ్లీ టీ కోరుకుంటుంది. డివిలియర్స్ దీని కోసం సన్నాహాలు ప్రారంభించాడు. సెప్టెంబర్ 13 న అతని బ్యాటింగ్ వీడియోను కూడా ఆర్‌సీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డివిలియర్స్ ఇందులో భారీ షాట్లు కొట్టడం కనిపిస్తుంది.
బ్యాటింగ్ ప్రాక్టీస్ గురించి డివిలియర్స్ మాట్లాడుతూ, ‘ఇది చాలా బాగుంది. వికెట్ నిజంగా కఠినమైనది. బౌలర్లు బంతిని బాగా బౌల్ చేశారు. ఇక్కడ చాలా తేమ ఉంది. మేము చెమటలు కక్కుతున్నాం. ఎందుకంటే తేమ కొంత బరువును తగ్గిస్తుంది. అయితే నాలాంటి వృద్ధులకు వీలైనంత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం. ఇది గొప్ప సెషన్. ప్రాక్టీస్‌లో ప్రతి ఒక్కరినీ చూడటం ఆనందంగా ఉంది. అందరూ ఆడేందుకు చాలా ఉత్సాహంగా కనిపించారు. నేను రేపటి వార్మప్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 రెండవ సగం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. సోమవారం అంటే 20 సెప్టెంబర్‌న ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
ఆర్‌సీబీ సహచరులను కలిసినందుకు డివిలియర్స్ సంతోషంగా ఉన్నాడు. ఐపీఎల్ మొదటి సగం తర్వాత ఆర్‌సీబీ సహచరులను కలవడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని ఏబీ డివిలియర్స్ తెలిపాడు. కొంతమంది ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా మారినందున మేలో మొదటి సగం ఆపేయాల్సి వచ్చింది. ‘ఖచ్చితంగా నేను ఆ వ్యక్తులను గుర్తుచేసుకున్నాను. నేను ఇద్దరు-ముగ్గురు వ్యక్తులను కలుసుకున్నాను. తరువాతి రోజుల్లో చాలా మందిని కలుస్తాను. ఈ రాత్రి నేను కొంతమందితో మాట్లాడాను. వారు కోలుకున్న విధానంపై ఆరా తీశాను. గత రెండు నెలల్లో వారు ఎదుర్కొన్న పరిస్థితిని తెలుసుకున్నాను. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి’ అంటూ తెలిపాడు.
ప్రథమార్ధంలో ఐపీఎల్ 2021 ఆగిపోయేవరకు వరకు ఆర్‌సీబీ ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచులు గెలిచింది. అలాగే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఏబీ డివిలియర్స్ ఈ ఏడు మ్యాచ్‌లలో 51.75 సగటుతో 207 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి. అత్యధిక పరుగులు చేసినవారిలో ఏబీడీ 12 వ స్థానంలో ఉన్నాడు.
Bold Diaries: AB starts net sessions
The cameras were on Mr.360 as he resumed practice ahead of #IPL2021. AB spoke to us about his first hit, reuniting with RCB, & how he visualizes the match situations in his mind, on @myntra presents Bold Diaries.#PlayBold #WeAreChallengers pic.twitter.com/jhd23zv99q
— Royal Challengers Bangalore (@RCBTweets) September 13, 2021