భారత ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వేసిన ఓ మ్యాజిక్ బాల్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. సుందర్ బౌలింగ్ చూసిన బ్యాటర్, బౌలింగ్ టీం ఆటగాళ్లతో సహా ప్రేకక్షులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంగ్లీష్ కౌంటీ టీమ్ ల్యాంకషైర్‌కు ఆడుతున్న భారత ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కెంట్ తమిళనాడుకు చెందిన బ్యాట్స్‌మెన్‌కి భారీ షాక్ ఇచ్చాడు. ఆఫ్ స్టంప్ అవతల వేసిన ఓ బంతి వికెట్లను పడగొట్టిన అరుదైన దృశ్యం చూస్తే.. మీరు కూడా ముచ్చటపడిపోతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లంకాషైర్ దీనిని మ్యాజిక్ బాల్ అని పిలుస్తూ, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతకుముందు 5 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్.. కెంట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ అద్భుతమైన బౌలింగ్‌తో 2వ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. వాటిలో ఒకటి బ్యాట్స్‌మెన్ కాక్స్‌కి అద్భుతమైన ఆఫ్ స్పిన్ బంతిని విసిరాడు. ఆఫ్ స్టంప్ వెలుపల ఉన్న ప్రదేశంలో విసిరిన బంతి.. అద్భుతంగా టర్న్ అయ్యి లోపలికి వచ్చింది. కాక్స్ బాగా ముందుకి వచ్చి బ్యాట్ ను అడ్డుపెట్టినా.. బాల్ మాత్రం ఫుల్ స్వింగ్ లో స్టంప్‌లను తాకింది. కాక్స్‌కు ఒక్క క్షణం అసలేం జరిగిందో అర్థం కాలేదు. పిచ్ వైపు, స్టంప్స్ వైపు చూస్తూ షాక్ అయ్యాడు.
That is an incredible delivery from @Sundarwashi5 ?#LVCountyChamp pic.twitter.com/rLyMvMmI9l
— LV= Insurance County Championship (@CountyChamp) July 28, 2022
ఇదే క్రమంలో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ గ్రాహం స్వాన్ వేసిన ఆఫ్ స్పిన్ బంతి రికీ పాంటింగ్ వికెట్ ను కూడా ఇలానే పడగొట్టింది. దీంతో రికీ పాంటింగ్ ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ మేనేజ్‌మెంట్ వాషింగ్టన్ సుందర్ మ్యాజిక్ బాల్ వీడియోను ట్విట్టర్‌లో అధికారికంగా షేర్ చేసింది. ఈ మ్యాచ్‌లోనూ, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సుందర్ 5 వికెట్లు తీశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ జట్టు 145 పరుగులకు ఆలౌటవ్వగా, కెంట్ జట్టు 270 పరుగులకు ఆలౌటైంది. 125 పరుగుల వెనుకంజలో నిలిచిన లంకాషైర్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 9 వికెట్ల నష్టానికి 436 పరుగులు చేసింది. ఆ తర్వాత కెంట్ బౌలింగ్‌లో జట్టును 127 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌ని గెలిపించాడు.