AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా ఆడే తర్వాతి టెస్ట్‌ సిరీస్‌లు ఇవే..! ఆ 5 దేశాలకు అప్పుడే మొదలైన దడ..

టీమ్ ఇండియా 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటోంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడిన తర్వాత, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్, మ్యాచ్‌ల వివరాలు, WTC పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా స్థానం గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది.

టీమిండియా ఆడే తర్వాతి టెస్ట్‌ సిరీస్‌లు ఇవే..! ఆ 5 దేశాలకు అప్పుడే మొదలైన దడ..
Team India
SN Pasha
|

Updated on: Aug 07, 2025 | 5:00 PM

Share

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఆడింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఈ 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో టీమ్ ఇండియా ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది, వాటిలో రెండు గెలిచింది. మరో రెండింటిలో ఓడిపోయింది. ఒకటి డ్రాగా ముగిసింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా మూడవ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ సైకిల్‌లో టీమ్ ఇండియా మరో ఐదు జట్లతో టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంది. వీటన్నింటినీ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం.

టెస్ట్ సిరీస్‌ల షెడ్యూల్

సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే 2025 ఆసియా కప్‌లో టీం ఇండియా ఆడాల్సి ఉంది. ఆ టోర్నీ చివరి మ్యాచ్ సెప్టెంబర్ 29న జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు అక్టోబర్ 2025లో స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 2 నుండి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. రెండవ మ్యాచ్ అక్టోబర్ 10 నుండి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.

ఈ టెస్ట్ సిరీస్ తర్వాత, శుభ్‌మాన్ గిల్ అతని బృందం నవంబర్ నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడతారు. మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుండి, రెండవ టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుండి ప్రారంభం అవుతాయి. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత, భారత జట్టు ఆగస్టు 2026లో శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ మధ్యలో టీం ఇండియా టీ20 ప్రపంచ కప్ 2026, ODI, టీ20 మ్యాచ్‌లు ఆడాలి.

2026 నవంబర్‌లో న్యూజిలాండ్‌లో..

భారతదేశం నవంబర్ 2026లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది, దీనిలో జట్టు రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో టీమ్ ఇండియా తన చివరి టెస్ట్ సిరీస్‌ను 2027 జనవరిలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్‌ను టీమ్ ఇండియా స్వదేశంలో ఆడనుంది. ఇంగ్లాండ్‌ను వారి సొంత దేశంలో టీమిండియా నిలువరించి, రెండు మ్యాచ్‌ల్లో ఓడించిన తీరు చూసి.. టీమిండియాతో టెస్టు సిరీస్‌లు ఆడబోయే ఆయ జట్లలో అప్పుడే భయం మొదలైంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి