ఫ్లోరిడా వేదికగా భారత్, కెనడా జట్ల మధ్య శనివారం అధికారిక మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్‌కు ముందు ఫ్లోరిడాలో వర్షం కురవడంతో మైదానం తడిసిపోయింది. దీంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోయింది. గ్రౌండ్ స్టాఫ్ నేలను ఆరబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కుదరలేదు. దీంతో అంపైర్ రెండుసార్లు ఫీల్డ్‌ని పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్‌కు ముందు ఫ్లోరిడాలో వర్షం కురవడంతో మైదానం తడిసిపోయింది. గ్రూప్-ఎ నుంచి భారత జట్టు ఇప్పటికే సూపర్ 8 రౌండ్‌లోకి ప్రవేశించగా, ఈ మ్యాచ్ రద్దు కావడంతో జట్టు స్థానంపై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు లేదు. అయితే కెనడాతో సూపర్ ఎయిట్‌కు ముందు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవడానికి భారత్‌కు మంచి అవకాశం లభించింది. కానీ వర్షం కారణంగా అది సాధ్యం కాలేదు. ఇక భారత జట్టు తమ తదుపరి మ్యాచ్ ను డైరెక్టుగా సూపర్ 8 రౌండ్‌లో ఆడనుంది. అక్కడ ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 20న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో మ్యాచ్ జరగనుంది. అంటే మరో ఐదు రోజుల టీమిండియా ఆటగాళ్లు మైదానంలోకి దిగనున్నారు
ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు గ్రూప్-డిలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడనుంది. అంటే బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లలో ఏదో ఒక టీమ్ భారత్ తో తలపడనుంది. దీంతో పాటు పటిష్ఠమైన ఆస్ట్రేలియాతో కూడా భారత జట్టు ఓ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ జూన్ 24న జరగనుంది..
గ్రూప్ దశలో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. న్యూయార్క్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ సమయంలో భారత్ ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో, పాకిస్థాన్‌పై 6 పరుగులతో, అమెరికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 7 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన టీమ్ ఇండియా గ్రూప్ దశను ముగించింది. గ్రూప్ దశ తర్వాత, సూపర్ 8లో టీమ్ ఇండియా తమ విజయపరంపరను కొనసాగిస్తుందని భారత జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.
India’s likely schedule in Super 8 round :-
– India vs Afghanistan on June 20
– India vs Bangladesh on June 22
– India vs Australia on June 24Will Indian team qualify for the semis?
🇮🇳🔥
Ans:- Definitely, Indian team will be qualified for the semi.#T20WorldCup pic.twitter.com/c6QS6ENTgp
— Monojit (@MonojitSinha11) June 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..