టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీ కానుకగా అందించింది. ఇందులో భాగంగా టీమిండియా ప్లేయర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు లభించనున్నాయి. అలాగే ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి 2.5 కోట్లు అందనుంది. అయితే సిబ్బంది రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు అదనపు ప్రైజ్ మనీని స్వీకరించేందుకు నిరాకరించారు. ఇతర సిబ్బంది మాదిరిగానే తనకు కూడా రూ.2.5 కోట్లు చాలన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ద్రవిడ్ బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ద్రవిడ్ బాటలోనే రోహిత్ శర్మ కూడా అడుగులు వేశాడు. ప్రైజ్ మనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే.. భారత జట్టులోని సహాయక సిబ్బందికి తక్కువ ప్రైజ్ మనీ ఇవ్వవద్దని, కావాలంటే తన ప్రైజ్ మనీలో కోత విధించమని బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని భారత జట్టు సహాయక సిబ్బంది బయటకు వెల్లడించారు. బీసీసీఐ ముందు స్టాఫ్‌కు మంచి పారితోషికం ఇవ్వాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుబట్టినట్లు తెలిసింది.
కాగా రూ. 125 కోట్ల ప్రైజ్ మనీలో.. 15 మంది టీమ్ ఇండియా, రాహుల్ ద్రవిడ్‌లకు ఒక్కొక్కరికి 5 కోట్లు అందనున్నాయి. అలాగే కోచింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి 2.5 కోట్లు లభించనున్నాయి. అదేవిధంగా, త్రోడౌన్ స్పెషలిస్టులతో సహా ఇతర సిబ్బందికి రూ.2 కోట్లు లభిస్తాయి. మరోవైపు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్ మనీని తగ్గించుకున్నాడు. బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీలో భాగంగా రాహుల్ ద్రవిడ్ రూ.5 కోట్లు అందుకోవాల్సి ఉంది. కానీ టీమ్ ఇండియా ఇతర కోచింగ్ సిబ్బందికి బీసీసీఐ రూ.2.5 కోట్లు చెల్లించింది. దీంతో అందరికీ సమానంగా ప్రైజ్ మనీ అందాలని రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్ మనీని తగ్గించుకున్నాడు.
🚨 NEWS 🚨
Rohit Sharma was willing to give up his bonus prize money after winning the T20 World Cup to ensure the support staff received more.A staff member said Rohit insisted they shouldn’t receive so little & offered to forgo his own bonus.
Rohit Sharma is a true LEADER! 🙌🏻 pic.twitter.com/FxpdjfZmPm
— Sangram (@itz_SAM4u) July 11, 2024
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వచ్చే శ్రీలంక సిరీస్‌కు దూరం కానున్నాడు. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో మళ్లీ జట్టులో కనిపించనున్నాడు. అంతే కాకుండా, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ వరకు అతనే టీమిండియా వన్డే, టెస్ట్ జట్లకు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
🚨 REPORTS 🚨
Rohit Sharma was willing to give up his bonus prize money for the support staff after winning the T20 World Cup to ensure they received a larger share. 😲
According to reports, one of India’s support staff members said, “When the 125cr prize money was distribute… pic.twitter.com/UUgN63ge30
— Fantasy Counsel (@counselfantasy) July 11, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..