AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill: సారా కాదు.. నా క్రష్ ఆమెనే.. నెటిజన్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన శుభ్మన్ గిల్..

Shubman Gill Crush: క్రికెటర్ శుభమాన్ గిల్, ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నెటిజన్లు మాత్రం శుభ్‌మన్ పేరును సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో లింక్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

Shubman Gill: సారా కాదు.. నా క్రష్ ఆమెనే.. నెటిజన్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన శుభ్మన్ గిల్..
Shubman Gill
Venkata Chari
|

Updated on: Mar 07, 2023 | 1:32 PM

Share

Shubman Gill Crush: క్రికెటర్ శుభమాన్ గిల్, ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నెటిజన్లు మాత్రం శుభ్‌మన్ పేరును సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో లింక్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తన క్రష్ పేరును వెల్లడించాడు. ఈ ఆన్సర్‌తో నెటిజన్లతోపాటు అభిమానులకు షాక్ ఇచ్చాడు. సారా అలీ ఖాన్ లేదా సారా టెండూల్కర్ మాత్రం కాదని, దక్షిణాది సినిమాల్లోని ప్రముఖ నటి తన క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు.

‘మీకు ఇష్టమైన బాలీవుడ్ నటి ఎవరు?’ అంటూ ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్‌ను ప్రశ్నించగా.. ఆయన సమాధానమిస్తూ, ‘రష్మిక మందన్న’ నా క్రష్ అంటూ బదులిచ్చాడు. శుభ్‌మన్ సమాధానం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

కాగా, గతేడాది శుభ్‌మాన్‌ను ఓ ఇంటర్వ్యూలో ‘బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటి ఎవరు?’ అంటూ అడిగితే.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే సారా అంటూ బదులిచ్చాడు. అలాగే ‘మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘అవును, కాకపోవచ్చు’ అంటూ సంధిగ్ధంలో పడేశాడు.

ఇవి కూడా చదవండి

శుభ్‌మన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంటాడు. సారా అలీ ఖాన్, శుభ్మాన్ తరచుగా పార్టీలలో కలిసి కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు శుభ్‌మన్ సారాతో డేటింగ్ చేస్తున్నాడా? లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.

పుష్ప సినిమాతో రష్మికకు దేశ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఆమె నటించిన గుడ్‌బై సినిమా కొన్ని రోజుల క్రితం విడుదలైంది. రష్మికతో పాటు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, ఎలి అవిరామ్, సునీల్ గ్రోవర్, సాహిల్ మెహతా, పావెల్ గులాటి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.

సారా రాబోయే సినిమాలు..

సారా నటించిన ‘గ్యాస్‌లైట్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె నటించిన అతరంగీ రే, లవ్ ఆజ్ కల్, సింబా, కేదార్‌నాథ్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు