ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ సేన రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని(మ్యూజియాన్ని) సందర్శించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ‘స్వాతంత్య్రం తర్వాత భారతదేశ ప్రయాణాన్ని వివరిస్తూ.. దేశ ప్రధాన మంత్రులకు అంకితం చేసిన ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని టీమిండియా సందర్శించంది’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతకముందు ఆసీస్, టీమిండియా మధ్య ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 ప్రారంభమైన మ్యాచ్ భారత్ విజయంతో 3 రోజులలోనే ముగిసింది. నాగ్‌పూర్ వేదికగా మొదటి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఈ టెస్టులో కూడా గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది.
A trip to cherish! #TeamIndia visited the captivating @PMSangrahalaya, a unique museum dedicated to the Prime Ministers of India, illustrating the journey of India after Independence. @PMOIndia
కాగా, ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్‌లో.. టీమిండియా మరో విజయం సాధిస్తే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్(2021-23) ఫైనల్‌కు చేరుతుంది. అలా డబ్య్లూటీసీ ఫైనల్‌కు భారత్ చేరితే.. ఇప్పటివరకు జరిగిన చాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టుగా భారత్ అవతరిస్తుంది. అంతకముందు జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(2021)లో ఫైనల్‌కు చేరిన భారత్ న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.