విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అతని బ్యాట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే కోహ్లీకి ఐసీసీ గొప్ప గౌరవం అందించింది. భారత మాజీ కెప్టెన్‌ను ఐసీసీ తొలిసారిగా ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. గత నెలలో అతని బలమైన ప్రదర్శనకు ఈ గౌరవం లభించింది. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఒంటిచేత్తో పాక్‌పై 82 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఇది కాకుండా నెదర్లాండ్స్‌పై 62 నాటౌట్, బంగ్లాదేశ్‌పై 64 నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి జింబాబ్వేకు చెందిన సికందర్ రజా, దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ సవాల్ విసిరినా.. ఇక్కడ మాత్రం కోహ్లీ సత్తా చాటాడు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ ఇప్పటివరకు 246 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
A batting stalwart wins the ICC Men’s Player of the Month award for October after some sensational performances ?
Find out who he is ?
— ICC (@ICC) November 7, 2022
జింబాబ్వే దిగ్గజ ఆల్-రౌండర్ సికందర్ రజా, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్‌లను ఓడించి విరాట్ కోహ్లీ ఈ అవార్డును గెలుచుకున్నాడు. విరాట్ కోహ్లీ తొలిసారిగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. అక్టోబర్ నెలలో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇలాంటి బ్యాటింగ్‌తో పాటు టీమ్‌ఇండియా తరపున అతని అద్భుతమైన ఆటతీరుతో ఈ అవార్డు లభించింది. అదే సమయంలో ఈ అవార్డు తర్వాత కోహ్లి మాట్లాడుతూ ‘నాకు ఈ అవార్డు లభించడం చాలా గౌరవంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
తొలిసారిగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్న విరాట్ కోహ్లీ గత నెలలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతుందని అంతా భావించిన సమయంలో విరాట్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌ను విరాట్ స్వయంగా తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా అభివర్ణించాడు. ఈ ఇన్నింగ్స్‌తో పాటు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా విరాట్ 62 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అదే సమయంలో అక్టోబర్ ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అతను 28 బంతుల్లో 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ అక్టోబర్ నెలలో 205 సగటుతో 205 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ కూడా 150.73గా ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..