Virat Kohli: రాసిపెట్టుకోండి భయ్యా.. ఈ ఏడాది విరాట్ కోహ్లీదే.. ఆ మూడే కీలకం..!

Virat kohli Milestones: 2026వ సంవత్సరం విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది ఈ టీమిండియా స్టార్ మూడు ప్రధాన మైలురాళ్లను (Virat kohli Key Milestones) అధిగమించే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli: రాసిపెట్టుకోండి భయ్యా.. ఈ ఏడాది విరాట్ కోహ్లీదే.. ఆ మూడే కీలకం..!
Virat Kohli

Updated on: Jan 02, 2026 | 12:35 PM

Virat kohli Milestones: విరాట్ కోహ్లీకి 2025 అద్భుతంగా సాగింది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అయిన కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో కలిసి చివరకు ఐపీఎల్ (IPL) ట్రోఫీని గెలవడమే కాకుండా, జాతీయ జట్టుతో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడాడు. గతేడాది చివరలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో ఏడాదిని ఘనంగా ముగించాడు. ఇప్పుడు 2026లో కోహ్లీ కోసం మూడు భారీ రికార్డులు వేచి చూస్తున్నాయి.

1. ఐపీఎల్‌లో 9,000 పరుగుల మైలురాయి:

ఐపీఎల్ 2026లో కోహ్లీ మరో 339 పరుగులు చేస్తే, ఈ టోర్నీ చరిత్రలో 9,000 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం అతను 259 ఇన్నింగ్స్‌ల్లో 8,661 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ (267 ఇన్నింగ్స్‌ల్లో 7,046 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.

కోహ్లీ తన కెరీర్ మొత్తం కేవలం RCB జట్టుకే ఆడాడు. గత మూడు ఐపీఎల్ సీజన్లలో కోహ్లీ ఎప్పుడూ 600 కంటే తక్కువ పరుగులు చేయకపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

2. వన్డేల్లో 15,000 పరుగులు..

సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డే క్రికెట్‌లో 15,000 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలవవచ్చు. సచిన్ 452 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 18,426 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 296 ఇన్నింగ్స్‌ల్లో 14,557 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 443 పరుగులు అవసరం.

3. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక స్కోరర్..

2026లో న్యూజిలాండ్‌తో జరిగే తన మొదటి మ్యాచ్‌లోనే కోహ్లీ ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ (టెస్టులు + వన్డేలు + టీ20లు)లో కోహ్లీ 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే, అతను కుమార్ సంగక్కర (28,016 పరుగులు) రికార్డును అధిగమించి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అవతరిస్తాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..