India vs England: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇంగ్లాండ్‌తో 8 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో 5 టీ20ఐలు, 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 సిరీస్ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యే ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
భారత్, ఇంగ్లండ్ మధ్య జనవరి 22 నుంచి సిరీస్ ప్రారంభం కానుండగా, ముందుగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
1వ టీ20ఐ: జనవరి 22 (చెన్నై)
2వ టీ20ఐ: జనవరి 25 (కోల్‌కతా)
3వ టీ20ఐ: జనవరి 28 (రాజ్‌కోట్)
4వ టీ20ఐ: జనవరి 31 (పుణె)
5వ టీ20ఐ: ఫిబ్రవరి 2 (ముంబై)
1వ వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్‌పూర్)
2వ వన్డే: ఫిబ్రవరి 9 (కటక్)
3వ వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్)
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీ హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరగనుంది. దీని ప్రకారం టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నీకి సంబంధించి భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..
భారత్ vs బంగ్లాదేశ్: ఫిబ్రవరి 20 (దుబాయ్)
భారత్ vs పాకిస్థాన్: ఫిబ్రవరి 23 (దుబాయ్)
భారత్ vs న్యూజిలాండ్: మార్చి 2 (దుబాయ్)
సెమీ-ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 4 (దుబాయ్)
ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 9 (దుబాయ్).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..