ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో టీమిండియాకు ఘోర పరాజయాలతోపాటు మరో ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్(ICC ODI Rankings)లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి నుంచి భారత క్రికెట్ జట్టు వన్డే క్రికెట్ ఆడలేదు. ఈ మేరకు కొత్త ర్యాంకింగ్‌లో ఆ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ కంటే వెనుకంజలో నిలిచింది. వెస్టిండీస్‌పై సిరీస్ విజయం ఆధారంగా పాకిస్థాన్(Pakistan vs West Indies) భారత్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది.
సోమవారం, జూన్ 13న ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు నాలుగో స్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశం పాకిస్థాన్ జట్టు భారత్‌ను వెనక్కు నెట్టింది. బాబర్ అజామ్ కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టు ఇటీవలి కాలంలో వన్డే క్రికెట్‌లో నిలకడగా రాణిస్తోంది. మార్చిలో ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత, జూన్ 12న ఆదివారం నాటి మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి, సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
న్యూజిలాండ్ @ నంబర్ వన్..
వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం వల్ల పాకిస్థాన్‌కు ప్రయోజనం లభించింది. ప్రస్తుతం ఆ టీం 106 పాయింట్లను కలిగి ఉంది. దాని ఆధారంగా ఆటీం నాల్గవ స్థానానికి చేరుకున్నారు. భారత జట్టు 105 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. 125 పాయింట్లతో న్యూజిలాండ్ నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లు భారత్ కంటే దిగువన ఉన్నాయి.
ఇంగ్లండ్‌కు పయనం కానున్న టీమిండియా..
వెస్టిండీస్‌పై విజయంతో పాటు, భారత జట్టు వన్టేలు ఆడకపోవడం వల్ల పాకిస్థాన్‌కు లాభించింది. నిజానికి ఫిబ్రవరి నుంచి టీమ్ ఇండియా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అంతకుముందు భారత్ కూడా 3-0తో వెస్టిండీస్‌ను ఓడించింది. ఇప్పుడు ర్యాంకింగ్స్‌లో మళ్లీ తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు భారత జట్టు ప్రయత్నిస్తుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఈ నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఒక టెస్టు, టీ20 తర్వాత టీమ్ ఇండియా అక్కడ 3 వన్డేలు కూడా ఆడనుంది. ఈ సిరీస్ ఫలితంపైనే టీమిండియా ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది.