Asia Cup 2025: ఆ విషయంలో శుభ్మన్ గిల్ అంత వీకా..? ఆసియా కప్‌నకు ముందే బయటపడ్డ నిజం..

Asia Cup 2025: సెప్టెంబర్ 10 నుంచి జరిగే ఆసియా కప్‌లో శుభమన్ గిల్ తన మ్యాజిక్‌ను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. దీనికి కారణం దుబాయ్ పిచ్, ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఉపయోగించుకోగల బలహీనత. శుభ్‌మాన్ గిల్ ఏ అంశంలో బలహీనంగా ఉన్నాడు. దుబాయ్‌లో అతను ఎందుకు విఫలమయ్యాడు. మొత్తం నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Asia Cup 2025: ఆ విషయంలో శుభ్మన్ గిల్ అంత వీకా..? ఆసియా కప్‌నకు ముందే బయటపడ్డ నిజం..
Shubman Gill

Updated on: Sep 05, 2025 | 6:09 PM

Asia Cup 2025: ఆసియా కప్‌నకు ముందు శుభ్మన్ గిల్‌ను టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. కానీ, దుబాయ్‌లో అతని బ్యాట్ పంజా విప్పుతుందా? గత ఆసియా కప్‌లో, ఈ ఆటగాడు భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేశాడు. కానీ, ఈసారి అతను ఈ ఘనత సాధించడం అంత సులభం కాదని తెలుస్తోంది. దీనికి కారణం దుబాయ్ పిచ్, ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఉపయోగించుకోగల బలహీనత. శుభ్‌మాన్ గిల్ ఏ అంశంలో బలహీనంగా ఉన్నాడు. దుబాయ్‌లో అతను ఎందుకు విఫలమయ్యాడు. మొత్తం నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శుభ్‌మాన్ గిల్ బలహీనత..

ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో అతను పరుగులు చేస్తున్నాడు. కానీ, దుబాయ్‌లో పరుగులు సాధించడం అతనికి అంత సులభం కాదు. ఎందుకంటే, అక్కడి పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. గిల్ టెక్నిక్ బాగున్నందున స్పిన్నర్లపై బాగా ఆడతాడని అందరికీ తెలుసు. కానీ, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టీ20 ఇంటర్నేషనల్‌లో స్పిన్నర్లపై శుభ్‌మన్ గిల్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.

స్పిన్నర్లపై శుభ్‌మాన్ గిల్ పరిస్థితి దారుణం..

అంతర్జాతీయ టీ20లో శుభ్‌మాన్ గిల్ స్పిన్నర్లపై 18 ఇన్నింగ్స్‌ల్లో 190 పరుగులు చేశాడు. స్పిన్నర్లపై అతని సగటు కేవలం 19. ఇది మాత్రమే కాదు, ఈ ఆటగాడి స్ట్రైక్ రేట్ కూడా కేవలం 125. ఆసియా కప్‌లో శుభ్‌మాన్ గిల్ పరిస్థితి అలాగే ఉంటే, అతనికి కష్టం అవుతుంది. ఆసియా కప్ సమయంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఈ సమయంలో దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. పెద్ద విషయం ఏమిటంటే ప్రత్యర్థి జట్లు పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో, శుభ్‌మాన్ గిల్ తన బలహీనతపై పని చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో సత్తా..

అయితే, శుబ్‌మాన్ గిల్ IPL 2025లో స్పిన్నర్లపై చాలా బాగా రాణించాడు. గిల్ IPL 2025లో మొత్తం 650 పరుగులు చేశాడు. అందులో అతను స్పిన్నర్లపై 270 పరుగులు చేశాడు. ఈ ఆటగాడికి స్పిన్నర్లపై 163 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. అతని సగటు కూడా 135. IPL 2025లో అతను స్పిన్నర్లపై రెండుసార్లు మాత్రమే ఔటయ్యాడు. గిల్ స్పిన్నర్లపై తన ఆటను మెరుగుపరుచుకున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు దానిని ఆసియా కప్‌నకు తీసుకెళ్లడం మిగిలి ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..