ఎంగేజ్‌మెంట్‌‌తో సడన్ షాకిచ్చిన టీమిండియా సెన్సేషన్.. కాబోయే వధువు ఎవరో తెలుసా?

Indian Player Prithvi Shaw Engagement With Akriti Agarwal: భారత యువ క్రికెటర్ పృథ్వీ షా తన ప్రేమ జీవితంలో కొత్త అడుగు వేశాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆకృతి అగర్వాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి అభిమానులకు ఆనందకరమైన సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

ఎంగేజ్‌మెంట్‌‌తో సడన్ షాకిచ్చిన టీమిండియా సెన్సేషన్.. కాబోయే వధువు ఎవరో తెలుసా?
Prithvi Shaw Love Story

Updated on: Mar 08, 2026 | 6:14 PM

Prithvi Shaw Love Story: భారత యువ క్రికెటర్ పృథ్వీ షా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మాయితో ఆకృతి అగర్వాల్‌తో నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించాడు. ఈ వార్తతో అభిమానులు, క్రికెట్ ప్రపంచం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేసిన పృథ్వీ షా ఒక భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. “మైదానంలో సిక్సర్లు కొట్టినట్లే, జీవితంలో కూడా అదే ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఆమె నా పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇప్పుడే మేం నిశ్చితార్థం చేసుకున్నాం” అని 26 ఏళ్ల పృథ్వీ షా పేర్కొన్నాడు.

ఆకృతి అగర్వాల్ ఎవరు?

పృథ్వీ షా నిశ్చితార్థం చేసుకున్న ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా, నటిగా మంచి గుర్తింపు పొందింది. 22 ఏళ్ల ఆకృతి అగర్వాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆమె ఉన్నత విద్య కోసం ముంబైకి వెళ్లింది.

ముంబైకి వచ్చిన తర్వాత నటనపై ఆసక్తి పెంచుకున్న ఆకృతి ‘త్రిముఖ’ అనే చిత్రంలో నటించింది. ఈ సమయంలో పృథ్వీ షాతో పరిచయం ఏర్పడి అది క్రమంగా ప్రేమగా మారింది. గత ఏడాది ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ రీల్ చేయడం ద్వారా తమ సంబంధాన్ని అభిమానులకు సూచించారు.

ఇటీవల సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహ వేడుకకు కూడా పృథ్వీ షా-ఆకృతి జంటగా హాజరయ్యారు. ఇప్పుడు నిశ్చితార్థం ద్వారా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

పృథ్వీ షా కెరీర్ ప్రయాణం..

చిన్న వయసులోనే ప్రతిభ చాటిన పృథ్వీ షా భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వరల్డ్ కప్ గెలిపించాడు. ఆ విజయంతో టీమిండియాలో అరంగేట్రం చేసిన అతను ఓపెనర్‌గా ప్రారంభంలో మంచి ప్రదర్శన కనబరిచాడు.

అయితే, కొంతకాలం ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇటీవల మళ్లీ ఫామ్‌లోకి వచ్చి ముంబై తరఫున దేశీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లో కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ ఏడాది మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us