టీమ్ ఇండియా ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి మ‌ృతి.. క్యాన్సర్‌తో బాధపడుతూ తుది శ్వాస విడిచిన కిరణ్ పాల్ సింగ్..

|

May 20, 2021 | 7:59 PM

Bhuvneshwar Kumar's Father Died : టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కన్నుమూశారు. కిరణ్ పాల్ సింగ్ చాలాకాలంగా క్యాన్సర్‌తో

టీమ్ ఇండియా ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి మ‌ృతి.. క్యాన్సర్‌తో బాధపడుతూ తుది శ్వాస విడిచిన కిరణ్ పాల్ సింగ్..
Bhuvneshwar Kumar
Follow us on

Bhuvneshwar Kumar’s Father Died : టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కన్నుమూశారు. కిరణ్ పాల్ సింగ్ చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఎయిమ్స్‌లో చికిత్స తర్వాత అతడిని తిరిగి మీరట్కు తీసుకువచ్చారు. ఈ రోజు ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఇటీవల మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ తండ్రి కూడా మరణించగా, మహిళా జట్టు సభ్యులు వేద కృష్ణమూర్తి, ప్రియా పునియా కూడా తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు.

భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ వయసు 63 సంవత్సరాలు. అతను క్యాన్సర్‌తో పాటు అనేక ఇతర వ్యాధులతో బాధపడుతున్నాడు. అతను ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖలో ఉద్యోగం చేసేవాడు. అక్కడి నుంచి VRS తీసుకొని కుటుంబంతో కలిసి మీరట్లో నివసిస్తున్నాడు. చివరి క్షణాల్లో భువనేశ్వర్ కుమార్, కుమార్తె రేఖా, భార్య ఇంద్రేష్ దేవి ఉన్నారు. చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న కిరణ్ పాల్ అనేక ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నాడు. అతనికి కీమో థెరపీ కూడా జరిగింది. కానీ ఎటువంటి మెరుగుదల కనిపించలేదని వైద్యులు తెలిపారు. దీంతో మీరట్ లోని గంగనగర్ ప్రాంతంలో ఉన్న తమ ఇంటికి తిరిగి తీసుకువచ్చారు అక్కడ అతను మరణించాడు.

భువనేశ్వర్ తండ్రి మొదట బులంద్‌షహర్‌కు చెందినవాడు. అక్కడ నుంచి వచ్చి మీరట్‌లో స్థిరపడ్డాడు. ఇప్పుడు అతని చివరి కర్మలు బులంద్‌షహర్ సమీపంలోని పూర్వీకుల గ్రామంలో నిర్వహించబడతాయి. భువనేశ్వర్ తన తండ్రి మృతదేహంతో బులంద్‌షహర్‌కు వెళ్లాడు.గత కొన్ని వారాల క్రితం మహిళా జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ వేద కృష్ణమూర్తి కరోనావైరస్ కారణంగా తల్లి, అక్కలను కోల్పోయింది. అదే సమయంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ తండ్రి కరోనావైరస్ కారణంగా ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. భారత మహిళా జట్టు యువ క్రీడాకారిణి ప్రియా పునియా తల్లి కూడా కరోనాతో మరణించింది.

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. 3 రోజులు ఆ సర్వీసులన్నీ బంద్.. ఎందుకో తెలుసా..?

రాఘవేంద్రుడి పుట్టిన రోజున మరో సర్‏ఫ్రైజ్.. దర్శకేంద్రుడి అభిమానులకు ‘పెళ్లి సందడి’ టీం స్పెషల్ ట్రీట్..

Covid19 Vaccine: మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా.. ఇప్పటివరకు ఎంత మంది టీకా తీసుకున్నారంటే..!