Bhuvneshwar: టీమిండియా పేసర్‌ భువీ కూతురును చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..

|

Nov 27, 2022 | 9:37 AM

ఇటీవల భువనేశ్వర్‌ కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆన్‌లైన్లో షేర్‌ చేసుకున్నాడు టీమిండియా పేసర్‌.

Bhuvneshwar: టీమిండియా పేసర్‌ భువీ కూతురును చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..
Bhuvneshwar Kumar
Follow us on

స్వింగ్‌ బౌలింగ్‌తో బ్యాటర్ల భరతం పడుతూ టీమిండియాలో కీలక బౌలర్‌గా ఎదిగాడు భువనేశ్వర్‌ కుమార్‌. అద్భుతమైన స్వింగ్‌ బౌలింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. క్రికెట్‌తో పాటు అప్పుడప్పుడూ సోషల్‌ మీడియా పోస్టులతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు భువీ. ముఖ్యంగా తన భార్య నుపుల్‌, కూతురు ఫొటోలను సరదగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటాడు. ఇదిలా ఉంటే ఇటీవల భువనేశ్వర్‌ కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆన్‌లైన్లో షేర్‌ చేసుకున్నాడు టీమిండియా పేసర్‌. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ప్రస్తుత వన్డే కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ తదితర క్రికెటర్లతో పాటు నెటిజన్లు భువనేశ్వర్ గారాల పట్టికి శుభాకాంక్షలు తెలిపారు. పాప ఎంతో క్యూట్‌గా ఉందంటూ ‘హ్యాపీ బర్త్‌ డే గార్జియస్‌’ అంటూ లవ్‌, హార్ట్‌ ఎమోజీలు షేర్‌ చేశారు. భువనేశ్వర్‌- నుపుర్‌ నగర్‌ 2017లో నవంబరు 23న పెళ్లి చేసుకున్నారు. వీరి నాలుగేళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా గతేడాది చివర్లో (నవంబర్‌ 23) వీరికి పండంటి పాప పుట్టింది.

కాగా టీ20 ప్రపంచకప్‌ 2022లో అంచనాల మేర రాణించలేకపోయాడు భువనేశ్వర్‌. అయినా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు. రెండో టీ20లో 12 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టగా, మూడో మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయకుండా 35 పరుగులు ఇచ్చాడు. కాగా వన్డే సిరీస్‌ నుంచి భువీకి విశ్రాంతి కల్పించారు. దీంతో స్వదేశానికి తిరిగొచ్చాడు. పాప మొదటి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..