
Shubman Gill, India vs Australia: ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ ప్రారంభమైంది. అక్టోబర్ 8న MA చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అయితే, ఈ తొలి మ్యాచ్‌కు ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ సోకింది. 24 ఏళ్ల గిల్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే ప్రపంచకప్ ఓపెనర్‌లో ఆడే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన ట్రైనింగ్ సెషన్‌లో గిల్‌కి డెంగ్యూ సోకినట్లు సమాచారం.
2023 వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన గిల్ ప్రపంచకప్‌లోని మొదటి మ్యాచ్ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు అతని గైర్హాజరు జట్టుకు పెద్ద దెబ్బే. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో అతనికి బదులుగా ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. దీంతో రోహిత్ శర్మతోపాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ నంబర్ 3లో రానున్నాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు దూరమయ్యే ముందు గిల్‌కు ఈరోజు మరో డెంగ్యూ పరీక్ష నిర్వహించనున్నారు. జ్వరం తీవ్రంగా ఉంటే గిల్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం కావచ్చు. “చెన్నైలో దిగిన తర్వాత, శుభ్‌మన్‌కి తీవ్ర జ్వరం వచ్చింది. దీనిపై పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం టెస్టు నిర్వహించి ఓపెనింగ్ మ్యాచ్‌లో పాల్గొనాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
దేశ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నెల ప్రారంభంలో, భారత కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్సుఖ్ మాండవ్య ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రపంచకప్‌లో బరిలో దిగే భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..